Political News

సుప్రీం ఆదేశాలు… నామినేషన్ల గడువు పెరుగుతుందా?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి తదితర ప్రాంతాల్లో ఘర్షణలు జరగడంతో అక్కడ నామినేషన్ల గడువు పొడిగించాలని వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా ప్రత్యర్థి పార్టీల వారు, పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే వైసీపీ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

19 చోట్ల హింస జరిగినట్లు ఫిర్యాదు అందిందని, ఆ స్తానాల్లో నామినేషన్ల తేదీలు పొడిగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాదు, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా స్థానాల్లో ఈ నెల 25 వరకు అభ్యర్థులను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది.

ఓ పక్క ఈ తీర్పు వెలువడగా..మరోపక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా కూడా వైసీపీ అభ్యర్థులను కొన్ని చోట్ల నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి, తాజా తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

This post was last modified on October 21, 2026 12:15 pm

Share

Recent Posts

చాప కింద నీరులా 100 కోట్లు కొల్లగొట్టింది

ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…

13 minutes ago

పెద్దోళ్ళు తీసిన దెయ్యాలు ప్రేక్షకులని భయపెడతాయా

మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. అయితే ఈ ఇద్దరూ…

31 minutes ago

ఏటిగట్టు ఇంకో ఆప్షన్ వైపు చూస్తోందా

సాయిదుర్గ తేజ్ గత రెండేళ్లకు పైగా అంకితమైపోయిన సంబరాల ఏటిగట్టు గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 12 వచ్చేయాలి.…

2 hours ago

రావణుడు హైలైట్ అయితే ఇబ్బందే

ఇంకో పధ్నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.…

2 hours ago

ఏపీ లోక‌ల్ వార్‌… జ‌గ‌న్ తెలుసుకోవాల్సింది ఇదే.. !

స్థానిక ఎన్నిక‌ల సమ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు జరిగింది 25 శాతం మాత్ర‌మే!. మునిసిపాలిటీలు, మునిసిప‌ల్ కార్పొరే ష‌న్ల‌కు మాత్ర‌మే ఎన్నిక‌ల…

4 hours ago

14 ఏళ్ల కింద‌టి విడాకుల పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పు

విడాకుల కేసుల‌ను గ‌రిష్ఠంగా ఏడాదిలో ప‌రిష్క‌రించాల‌ని.. సుప్రీంకోర్టు గ‌తంలోనే దేశంలోని హైకోర్టుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. విడాకుల కేసులలో…

4 hours ago