Political News

టీడీపీ 11…జనసేన 21…భలేగుంది కదూ…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 సీట్లు అనగానే ఎవరికైనా సరే వైసీపీ గుర్తుకు రావడం ఖాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అప్పటి నుంచి అధికార టీడీపీ, జనసేన పార్టీలు ‘ జనం మీకు 11 సీట్లే ఇచ్చారు, గుర్తుంచుకోండి ‘ అని తరచుగా ఆట పట్టించడం జరుగుతుంది. 11 సీట్లు అంటే చాలు వైసీపీ నాయకులకు ఎక్కడ లేని ఉక్రోషం వస్తుంది. ఇది చూసి జనాలు ముసిముసిగా నవ్వుకోవడం కనిపిస్తుంది.

అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ తో మొత్తం 21 స్థానాలు గెలుచుకొని రికార్డ్ సృష్టించింది. అంతకుముందు మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని జనసేనను ఉద్దేశించి వైసీపీ తరచుగా విమర్శలు గుప్పించేది. అదికాస్త తిరగబడటంతో 21 నెంబర్ అన్నా సరే వైసీపీ నాయకులకు ముచ్చేమటలు పడుతుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ‘ మాకు 21 సీట్లు వచ్చాయి.. మీకు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు జనాలు ‘ అంటూ దెబ్బకు దెబ్బ తీస్తున్నారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఉమ్మడిగానే పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో 17 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా అందులో టీడీపీ 11 స్థానాల్లో పోటీ చేస్తోంది. మొత్తం 106 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. అంటే 2024 ఎన్నికల రిజల్ట్ ఇక్కడ పరోక్షంగా కనిపిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి తీరుతామని జనసేన చెబుతుంది. 11 కార్పొరేషన్లు సొంతం చేసుకుంటామని టీడీపీ ధీమాగా వుంది.

వైసీపీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. అధికారంలో వున్నప్పుడు భయపెట్టి ఏక పక్ష విజయాన్ని సొంతం చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కున్న వైసీపీకి ఇప్పుడు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. దీంతో ఎలాగైనా సరే కనీసం పోటీ చేస్తే చాలంటూ కేడర్ ను బతిమాలుకుంటున్నారు నాయకులు. ఈ పరిస్థితిలో వారికి ఈ టీడీపీ 11, జనసేన 21 నెంబర్లు కలవరపెడుతున్నట్టు కనిపిస్తుంది.

This post was last modified on October 18, 2026 6:09 am

Share

Recent Posts

కంపెనీకి చివరి మెయిల్.. ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు!

భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…

9 hours ago

దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…

9 hours ago

ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…

10 hours ago

తెలుగు వాళ్లకు ఆయన చాలా స్పెషల్

వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన…

10 hours ago

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

11 hours ago

అందరికీ న్యాయం చేసిన టీడీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…

11 hours ago