భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి తన కంపెనీకి పంపిన ఓ ఈమెయిల్ ఈ కేసులో కీలకంగా మారింది. తాము ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నామని అందులో రాయడంతో సహోద్యోగులు షాక్ అయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేరళకు చెందిన మహమ్మద్ అస్లాం (30), ఫర్హానా దంపతులు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. వీరికి 2023లో వివాహమైంది. కొంతకాలం బెంగళూరులో ఉన్న ఈ జంట మూడు నెలల క్రితం గురుగ్రామ్‌కు మారింది. అక్కడి ఎం3ఎం మెరీనా అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం ఫర్హానా పుట్టినరోజు కాగా, అదే రోజు ఇద్దరూ మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
బుధవారం ఉదయం 7 గంటల సమయంలో అస్లాం తన కంపెనీకి ఈమెయిల్ పంపినట్లు సమాచారం. ‘మేము ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నాం’ అని అందులో పేర్కొనడంతో పాటు కుటుంబ సభ్యులు, ఇంటి యజమాని ఫోన్ నంబర్లను కూడా ఇచ్చారు. ఈ మెయిల్ చూసిన సహోద్యోగులు వెంటనే ఇంటి యజమానిని సంప్రదించారు. ఇంటికి వెళ్లి చూడగా అస్లాం, ఫర్హానా మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
ప్రాథమికంగా ఫర్హానాను అస్లాం హత్య చేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్య కేసు నమోదు చేశారు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు, డైరీతో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, మరణాలకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు అస్లాం, ఫర్హానా మధ్య మంచి అనుబంధం ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు తమకు ఎప్పుడూ తెలియలేదని పేర్కొన్నారు. దీంతో అసలు ఏం జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉంది. కంపెనీకి పంపిన ఈమెయిల్‌తో పాటు స్వాధీనం చేసుకున్న డైరీ, ఫోన్లలోని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నారు.
This post was last modified on October 17, 2026 9:29 pm
మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…
యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…
వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన…
ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎంతో మంది వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉన్నారు. ఈ పార్టీల తరఫున…