మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈడీ యాక్టివ్ కావడంతో వైసీపీ శ్రేణులు ఉలిక్కి పడ్డారు. ఇది రొటీన్ వ్యవహారంలో భాగంగా జరిగిందా మారుతున్న రాజకీయ పరిణామాలకు సంకేతమా అన్నది స్పష్టం కావాల్సి వుంది. లేకపోతే మాత్రం జగన్ కోర్టుకు రోజూ వెళ్లాల్సి వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
తెలంగాణా హై కోర్టులో ఈడీ పిటీషన్ దాఖలు చేసింది. రోజువారీ విచారణ జరిపాలని కోరడమే కాకుండా త్వరగా విచారణ పూర్తి చేసి నిజానిజాలు తెల్చాలని కోరింది. ఇన్నాళ్లుగా రకరకాల సాకులు చూపుతూ జగన్ విచారణకు హాజరుకాకుండా పోవడాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ తో పాటుగా మిగిలిన వారందరినీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని కోరింది. గతంలో కూడా ఈ విషయం మీద ఈడీ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు గుర్తు చేసింది. ఇప్పటికే సీబీఐ కోర్టులో తొమ్మిది ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్ ఉన్నాయని అధికారులు పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఈడీ పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది. హరిరామ జోగయ్యతో పాటుగా ఇతరులు వేసిన పిటిషన్లను కలిపి ఈడీ పిటిషన్ తయారుచేయాలని సూచించింది. అన్నీ పిటిషన్లు కలిపి ఈ నెల 13 వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో కోర్టు నిర్ణయం పై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.
జగన్ తో పాటుగా మరికొందరి మీద 2016 నుండి 2021 మధ్య కాలంలో నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో దాఖలు చేసిన 9 ఈడీ చార్జిషీట్లు గత పదేళ్లుగా ప్రాథమిక దశలోనే పెండింగ్‌లో ఉన్నాయని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. నిందితులు కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై తుది తీర్పు రాకపోవడం, న్యాయమూర్తుల బదిలీలు వంటి సాంకేతిక కారణాల వల్ల విచారణ ముందుకు సాగడం లేదని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా విచారణ పూర్తి చేయాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కూటమి నాయకుల్లో సంతోషం కనిపిస్తుండగా వైసీపీ నాయకుల్లో ఏమౌతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.
This post was last modified on October 11, 2026 9:37 am
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…