రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో షాకిచ్చింది. బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేయటమే కాదు.. హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా తమ వద్దకు ఎలా వస్తారన్న సూటిప్రశ్నను సంధించింది. అంతేకాదు.. ట్రయల్ కోర్టులో విచారణ గడువు పెంచాలన్న వినతిని కొట్టేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య.. డోర్ డెలివరీ పెను సంచలనంగా మారటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన వేళ అనుమానాస్పద మరణంగా కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ ఉదంతంపై అప్పట్లో బాధిత కుటుంబం.. ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోస్టుమార్టం రిపోర్టులోనూ శరీరంపై 31 గాయాలు.. అంతర్గతంగా మూడు గాయాలు ఉన్నట్లుగా తెలిసింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో హత్య కేసుతో పాటు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను కలిపాయి. ఘటన చోటు చేసుకున్న నాలుగురోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణ సుప్రీం ముందుకు వెళ్లింది. ఆ సందర్భంగా 2026 నవంబరు నాటికి విచారణ పూర్తిచేయాలన్న గడువును సుప్రీం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అనంతబాబు.. కేసు గడువు విచారణను పెంచాలని పేర్కొంటూ అనంతబాబు దంపతులు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరి పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్.. జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ.. జస్టిస్ వీ. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ విషయంపై సుప్రీం స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లాలే కానీ.. నేరుగా సుప్రీంకోర్టుకు రావటం ఏమిటి? అంటూ ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపిస్తూ.. ట్రయల్ కోర్టులో విచారణ వేగంగా సాగుతోందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో విచారణ గడువును పొడిగించమని అడగటం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టులో కేసు విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పందిస్తూ.. విచారణ తుది దశకు చేరుకున్న వేళ.. బెయిల్ ఇవ్వమని కోరటం తొందరపాటు అవుతుందని పేర్కొంటూ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.
కేసు విచారణ గడువు పెంచాలని మీరెందుకు ఇంతలా ఆత్రపడుతున్నారన్న ప్రశ్నను సుప్రీం ధర్మాసనం సంధించింది. ఒవకేళ సుప్రీంకోర్టు విధించిన గడువు ప్రకారం విచారణ పూర్తి కాదని.. కాస్త సమయం అవసరమని ట్రయల్ కోర్టు భావించి.. ఆ కోర్టు న్యాయమూర్తి లేఖ రాస్తే ఆలోచిస్తామని చెప్పింది. విచారణ ఇప్పుడున్న దశలో గడువు పొడిగింపును కోరుతూ దాఖలైన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
This post was last modified on October 8, 2026 7:59 pm
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…