Political News

“చేయి నరికేస్తా”… డిల్లీ పోలీసులకు రేణుక చౌదరి చుక్కలు

రేణుకా చౌదరి…ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈ పేరు సుపరిచితమే. ఫైర్ బ్రాండ్ మహిళా నేత, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడడం, దూకుడుగా వ్యవహరించడం ఆమె నైజం. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులపై లాఠీ ఛార్జ్ సమయంలో ఢిల్లీ పోలీసులు, మోదీ సర్కార్ పై ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

పిల్లలపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ ప్రయోగించిన ‘యూస్‌లెస్ గవర్నమెంట్’ ఇది అంటూ కేంద్రం తీరును ఆమె ఏకిపారేసిన వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రేణుకా చౌదరి మరోసారి ఢిల్లీ పోలీసులను మాస్ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసనలలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో రేణుకా చౌదరి మాట్లాడారు. తనను మహా అయితే అరెస్ట్ చేసి లోపల పడేస్తారు..అంతకన్నా ఏం చేస్తారు అంటూ ఆమె మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ సమయంలో ఒక జవాను ఆమెపై చేయి వేసి ఆమెను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో, ఆగ్రహానికి గురైన రేణుకా చౌదరి…ఆ జవాన్ ను నెట్టివేసి చేయి చేసుకున్నారు.

మహిళ అయిన తనపై జవాన్ చేయి ఎలా వేస్తారు అంటూ ఫైర్ అయ్యారు. జవాన్ ను ఎందుకు కొట్టారు అని ప్రశ్నించిన మహిళా పోలీసు అధికారిపై కూడా రేణుక మండిపడ్డారు. మహిళ పోలీస్ పక్కన ఉండగానే తనపై అతడు చేయి ఎలా వేస్తాడని నిలదీశారు. ఖబడ్దార్…చర్మం ఒలిచేస్తా…అంటూ ఆ జవాన్ కు రేణుకా చౌదరి వార్నింగ్ ఇచ్చారు.

ఎవడి ఇష్టమొచ్చినట్లు వాళ్లు మొనగాళ్లలా మీసాలు తిప్పుతున్నారని, ఇది ఎదవన్నర ఎదవ ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు. మా మీద చేయి చేసుకుంటారా….చేతులు నరికేస్తాను నా కొడకల్లారా…ఖబడ్దార్ అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పోలీసులకు రేణుకా చౌదరి ఇచ్చిన మాస్ వార్నింగ్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on October 9, 2026 10:24 am

Share

Recent Posts

రావణుడికి సీతమ్మ సర్టిఫికెట్ ఇవ్వడమేంటి

ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…

2 hours ago

ఏకగ్రీవాలతో కూటమి పార్టీల హై హై

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగింది. అక్కడ ఇక్కడా అని కాకుండా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అన్నీ ప్రాంతాల్లో…

2 hours ago

వారణాసి హైప్ కోసం టెన్షన్ ఎందుకంటే

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సినిమాకు ప్రత్యేకంగా హైప్ కావాలా అనే సందేహం ఎవరికైనా రావొచ్చు.…

2 hours ago

కోటి రూపాయల స్కీములు పని చేస్తాయా

ఎల్లుండి ఆదర్శ కుటుంబం, కల్ట్ తో పోటీ పడుతున్న చిన్న సినిమా కిల్లర్. పూర్వజ్ అనే దంపతులు పరిమిత బడ్జెట్…

3 hours ago

శంకర్ చేసిన తప్పేంటో తెలిసిపోయింది

మెగా ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేని డిజాస్టర్ గేమ్ ఛేంజర్. మూడేళ్ళ రామ్ చరణ్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు…

4 hours ago

ఉప్పాడను కుదిపేసిన అర్నబ్ తుఫాను

అర్నబ్ తుఫాను ధాటికి తీర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో…

7 hours ago