Political News

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని మడతబెట్టి మొదలు జిమ్ జిమ్ తార వరకు సోషల్ మీడియాకు వైరల్ ఫివర్ తెెచ్చిన డైలాగులు, పాటలు ఎన్నో ఉన్నాయి. ఇక, జనాల్లో బాగా పాపులర్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ మాటలు, పాటలను సినిమాల్లో కూడా వాడేస్తున్నారు.

ఆ కుర్చీని మడతబెట్టి….అంటూ ఓ తాత వాడిన బూతు మాటకు బీప్ వేసి మరీ మహేష్ బాబు తన సినిమాలో వాడేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న జిమ్ జిమ్ తార పాటను జగిత్యాలలో మెడికోలు వాడేసిన వైనం దూకుడులో బ్రహ్మానందాన్ని మహేష్ బాబు వాడిన వాడకం కంటే ఎక్కువే అని చెప్పవచ్చు.

వారం నుంచి పాట మైండ్ లో నుంచి పోడం లేదు మామ…ఏం ఫీల్ ఉన్నది మామా…అంటూ జెన్ జీ పోరగాళ్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న జిమ్ జిమ్ తార పాట గురించి కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం లక్ష్మీ అనే మహిళ పాడిన ఈ పాట ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అందుకే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి…పాట ట్రెండింగ్ లో ఉన్నప్పుడే వాడి పడేయాలి అని అనుకున్నారు జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు.

తమ కాలేజీకి పర్మినెంట్ బిల్డింగ్ ఎప్పుడు నిర్మిస్తారంటూ ప్రభుత్వాన్ని ఈ పాటతో ప్రశ్నించారు వాళ్లు. జిమ్ జిమ్ తార జిమ్ జిమ్ తార కాలేజెక్కడ షిన్నోడా…అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిమ్ జిమ్ తార పాట తరహాలోనే ఆ పాటను వాడేసిన మెడికోల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

This post was last modified on October 8, 2026 7:10 pm

Share

Recent Posts

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

50 minutes ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

2 hours ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

3 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

4 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

4 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

6 hours ago