Political News

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం చేస్తున్న మోదీ ప్రభుత్వం కూడా కూలిపోవడం ఖాయమని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. సర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్న ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చేత వెంటనే రాజీనామా చేయించాలని, లేకపోతే మోదీ, అమిత్ షా రాజీనామా చేయాల్సిన వస్తుందని హెచ్చరించారు.

సర్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన అరెస్టులతో ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడంతో రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. కేరళం సీఎంతో కలిసి బారా ఖంబ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, వీడీ సతీషన్ వస్తున్నారని తెలిసి పోలీసులు రాహుల్ గాంధీని బ్యాక్ డోర్ నుంచి తరలించారు. దాంతో ఆయనను కలవలేక పోయారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల సంఘం చేస్తున్న తప్పులను సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. జ్ఞానేష్ రాజీనామా కోసం రాహుల్ గాంధీ పోరాడుతుంటే ప్రభుత్వం ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుందని, వారిని వదిలిపెట్టేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలను అరెస్టు చేసి విసిరి వేశారని, వాళ్ళేమి ఉగ్రవాదులు కాదన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ ముంబైలో సీజెపి చేపట్టిన ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలిగించడం వంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం వెనక ఇలాంటి కుట్రలున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం సీఈసీకి మద్దతుగా నిలిచింది. మున్ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

This post was last modified on October 8, 2026 3:04 pm

Share

Recent Posts

చంద్రబాబుపై కేటీఆర్ సాఫ్ట్ కార్నర్… ఏంటి మార్పు?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది సామెత. అదిప్పుడు నిజమయ్యే సూచనలు కానవస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు…

3 hours ago

దర్శకుడిగా ఫెయిలయితే హీరోగా ఛాన్స్

తమిళనాడు సిఎం జోసెఫ్ విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తన తొలి ప్రయత్నం సిగ్మాతో చేయడం అది దారుణంగా…

3 hours ago

కమల్ హాసన్ నిజంగా అసాధ్యులే

లోకనాయకుడు కమల్ హాసన్ లేట్ ఏజ్ లోనూ తనదైన ప్లానింగ్ తో వాహ్ అనిపిస్తున్నారు. ఇది కేవలం సినిమాల్లో నటించడం…

4 hours ago

మెగావర్స్ కోసం మెగా మల్టీస్టారర్

ఇంకా విడుదల తేడా రాకుండానే, స్ట్రీమింగ్ జరగకుండానే చిరంజీవి టాక్ షో 'మెగా వర్స్' అభిమానుల్లో పెద్ద చర్చకు దారి…

4 hours ago

ఓదెల పరిధి తగ్గించుకుంటున్నాడా?

‘దసరా’ మూవీతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ శిష్యుడైన అతను.. డెబ్యూ…

5 hours ago

కొండా మేడమ్ తో పాటు ఇంకా చాలామంది క్షమాపణ చెప్పాలి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రెండేళ్ల క్రితం సంచలన ఆరోపణలు…

7 hours ago