స్టార్ కాంబినేషన్లు పెట్టుకుని సరైన కథా కథనాలు లేకుండా సినిమాలు తీస్తే జనాలు ఎగబడి చూసే రోజులు పోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఈ విషయంలో ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా పదే పదే చేసిన తప్పులే రిపీట్ చేస్తోంది. తాజాగా వచ్చినవి దాన్ని ఋజువు చేస్తున్నాయి. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబోలో రూపొందిన హైవాన్ చాలా దారుణంగా బోల్తా కొట్టింది. మలయాళం ఒప్పం రీమేక్ గా ప్రియదర్శన్ డైరెక్షన్లో రూపొందిన ఈ రివెంజ్ డ్రామాని ఆడియన్స్ తిరస్కరించారు.
ఎప్పుడో వచ్చిన దానికి ఇప్పుడు రీమేక్ చేయడమే ఇంత మూల్యం చెల్లించేలా చేసింది. తాజాగా వచ్చిన దాయ్ రా కూడా అదే బాటలో వెళ్తోంది. పృథ్విరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ కాంబోలో మేఘన గుల్జార్ దర్శకత్వంలో దీన్ని తెరకెక్కించారు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా ఎన్కౌంటర్ ఆధారంగా రూపొందించారు. ఓపెనింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. పికప్ సూచనలు కూడా కనిపించడం లేదట. నిర్మాతలు వీకెండ్ మీదే ఆశలు పెట్టుకుని చూస్తున్నారు.
ఈ రెండే కాదు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కనిపిస్తాయి. టాక్సిక్ మర్చిపోగలమా. కెజిఎఫ్ తర్వాత యష్ నాలుగేళ్ళ శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యింది. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తో అన్ని భాషల్లో దెబ్బ కొట్టింది. ఏదో యష్ పుణ్యమాని ఓ మూడు వందల కోట్ల గ్రాస్ దాటింది కానీ లేదంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ వారంలోపే చాప చుట్టేయడం అసలు ట్రాజెడీ.
ఇకపై ఫిలిం మేకర్స్ వీటిని హెచ్చరికగా తీసుకోవాలి. సౌత్ లో సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంటుందో హిందీ బ్యాచ్ విశ్లేషణ చేసుకోవాలి. ఇరుముడి, లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, మన శంకరవరప్రసాద్ గారు, నారి నారి నడుమ మురారి లాంటి ఎన్నో సినిమాలు నిర్మాతలకు కాసులు కురిపించాయి. ఇవేవి రెగ్యులర్ ఫార్ములాతో ఆడినవి కాదు. కంటెంట్ తో కొట్టినవి. ఇకనైనా స్టార్ పవర్ కాకుండా కథల పవర్ ని నమ్ముకుంటేనే ఎవరికైనా విజయాలు దక్కుతాయి.
This post was last modified on September 19, 2026 8:45 pm
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…