Political News

కర్ణాటక హామీలను ట్రంప్ కాపీ కొడుతున్నారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దేశంలోని కాంగ్రెస్ పార్టీ హామీలను కాపీ కొడుతున్నాడా అంటే ఔననే చెబుతున్నాడు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మరో రెండు నెలల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇరాన్ యుద్ధంలో బోర్లా పడ్డ ట్రంప్ చేజేతులా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నాడు. దీంతో మధ్యంతర ఎన్నికల్లో గట్టేక్కడానికి కుయుక్తులు పన్నుతున్నాడు. ఈ క్రమంలో ఉచిత పథకాలకు తెరదీశాడు.

నవంబర్లో జరిగే మధ్యంత ఎన్నికల్లో అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రతి ఒక్కరికీ ఐదు వేల డాలర్ల చొప్పున డివిడెండ్ ఇస్తానని ప్రకటించారు. ట్రంప్ ఇచ్చిన ఈ హామీ మీద ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం భిన్నంగా స్పందించారు. ట్రంప్ కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొడుతున్నారని కామెంట్ చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని డీకే చెప్పారు. బెంగళూరులో మీడియాతో చిట్ చాట్ చేస్తూ శివకుమార్ మాటల మధ్యలో అమెరికా ప్రసిడెంట్ ను గుర్తు చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో వున్న ట్రంప్ ఉచిత హామీలు ఇస్తున్నారని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బంపర్ హిట్ అయ్యాయని చెప్పారు. మా హామీలను మొదట మహారాష్ట్ర కాపీ కొట్టింది, తర్వాత రాజస్థాన్, బీహార్ కాపీ చేశాయి. ఇప్పుడు ట్రంప్ కాపీ చేసాడని వివరించారు.

డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ మీద ప్రతిపక్ష పార్టీలు జోక్స్ వేస్తున్నాయి. అసలే అమెరికా అప్పుల్లో వుంది. దాంట్లోంచి ఎలా బయట పడాలో తెలియక దిక్కులు చూస్తుంది. అలాంటి పరిస్థితిలో ట్రంప్ ఇచ్చిన ఐదు వేల హామిని నేరవేర్చడానికి లక్ష కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఆర్ధిక నిపుణులు లెక్కలు వేసి చెబుతున్నారు. ట్రంప్ హామీ గురించి గొప్పగా చెప్పుకోవడం మాని కర్ణాటకలోని ప్రజలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందివ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on September 16, 2026 6:19 am

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

7 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

8 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

10 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

10 hours ago