Political News

రియల్ లైఫ్ ‘బిచ్చగాడు’ ఈ బీజేపీ ఎమ్మెల్యే

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. తన తల్లిని బ్రతికించుకోవడానికి వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన కొడుకు 48 రోజులపాటు బిచ్చగాడిగా మారిన కథ అన్ని వర్గాల ప్రేక్షకులను కదిలించింది. కోటీశ్వరుడైన విజయ్ ఆంటోని తన గుర్తింపును ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి కేవలం భిక్షాటన ద్వారా వచ్చిన ఆహారాన్ని మాత్రమే తిన్న వైనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఇటువంటి సీన్లు కేవలం రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా ఉన్నాయి. వేల కోట్ల ఆస్తులున్న బీజేపీ ఎమ్మెల్యే ఒకరు బిచ్చగాడిగా మారిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఒక రోజుపాటు బిచ్చగాడిగా మారారు. రూ. 3,383 కోట్లకు పైగా ఆస్తులున్న పరాగ్ షా చిరిగిన దుస్తులతో రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేసిన వైనం చర్చనీయాంశమైంది. అధికారం, విలాసాలకు దూరంగా బిచ్చగాడిలా ఒక్కరోజైనా గడపాలని జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ ఉపదేశం ప్రకారం ఆయన ఇలా చేశారు. 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను రూ. 3,383 కోట్లుగా ప్రకటించిన పరాగ్ షా ఇలా ఒక్కరోజు భిక్షాటన చేయడం వార్తల్లో నిలిచింది.

దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరైన ఆయన అన్నీ వదిలేసి ఇలా యాచకుడిగా మారడం హాట్ టాపిక్ అయింది. ఒక రోజంతా భిక్షాటన తర్వాత సాధారణ దుస్తులు ధరించి స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదిగిన పరాగ్ షా భద్రతా సిబ్బంది, ఖరీదైన వాహనాలు, హోదా వదిలి ఒక రోజు పాటు వైరాగ్య జీవితం గడిపిన వైనంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

This post was last modified on September 16, 2026 6:08 am

Share

Recent Posts

కర్ణాటక హామీలను ట్రంప్ కాపీ కొడుతున్నారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దేశంలోని కాంగ్రెస్ పార్టీ హామీలను కాపీ కొడుతున్నాడా అంటే ఔననే చెబుతున్నాడు కర్ణాటక…

22 minutes ago

మోదీ పుట్టినరోజు.. దీపం వెలిగించండి!

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అప్రతిహాత విజయాలతో దూసుకొని వెళుతున్న నేపథ్యంలో ఈ సారి ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా…

1 hour ago

సీఎం రేవంత్ విభేదాలు… సాయంత్రానికి సర్దుబాటు

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో…

10 hours ago

ప్యారడైజ్ టికెట్ రేట్లకు ఏ స్ట్రాటజీ మంచిది

కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో…

10 hours ago

అల్లు అర్జున్ మామపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…

12 hours ago

ఎంఎస్ సుబ్బులక్ష్మి… వాళ్ళిద్దరికీ పెద్ద ఛాలెంజ్

రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

13 hours ago