సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు, అలంకరణ, ఫ్యాషన్ శైలికి అనుగుణంగా మార్చి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ రాజకీయ ప్రముఖులనూ ఆకర్షిస్తోంది. తామేమీ తక్కువ కాదన్నట్లుగా పలువురు రాజకీయ నాయకులు తమ ఫొటోలను కృత్రిమ మేధలో మార్చి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఫొటోను ‘80ల ట్రెండ్’లో భాగంగా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అప్పటి దుస్తులు, ఫ్యాషన్ శైలిని ప్రతిబింబించేలా కృత్రిమ మేధ సాయంతో ఫొటోలను మార్చి నెటిజన్లు పంచుకుంటున్నారు. ఇందుకోసం సాధారణ ఫొటోలను 80ల నాటి రూపానికి మార్చేలా సూచనలు ఇచ్చి చిత్రాలను రూపొందిస్తున్నారు. వాటిని ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖులకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రజాప్రముఖులు, రాజకీయ నాయకులకూ విస్తరించింది. ఇదే క్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా తన ఫొటోను 80ల ట్రెండ్‌లో పంచుకున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం కృత్రిమ మేధతో రూపొందించిన చిత్రాలకు భిన్నంగా.. 1980ల నాటి తన అసలైన ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ‘‘80ల ట్రెండ్‌లో అసలైన వాటితో చేరుతున్నా.. ఆ దశాబ్దానికి చెందిన నా కొన్ని నిజమైన ఫొటోలు ఇవిగో’’ అంటూ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు పంచుకున్న పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
This post was last modified on September 11, 2026 2:22 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…