అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు రోజుని బాక్సాఫీస్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ ఏడాది సరిగ్గా శుక్రవారం రోజు వస్తోంది. దానికి తగ్గట్టే టాలీవుడ్ కూడా రెడీ అవుతోంది. ముందైతే వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ రిలీజవుతోంది. వాయిదా లేదని కన్ఫర్మ్ చేస్తూ టీజర్ డేట్ కూడా ఇచ్చారు. పాత్రల తాలూకు పరిచయాల వీడియోలు వచ్చాయి కానీ తమన్ సాంగ్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మిగిలినవి మాత్రం ఒక్కొక్కటిగా రష్ పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సిఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘సిగ్మా’కు రంగం సిద్ధమవుతోంది. కోలీవుడ్ ప్రమోషన్లు ఆల్రెడీ ఒక ఈవెంట్ తో మొదలైపోయాయి. ఫహద్ ఫాసిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’కు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడాన్ని బట్టి చూస్తే కంటెంట్ ఆషామాషీగా ఉండదని అర్థమవుతోంది. బజ్ మెల్లగా పెంచే ప్రయత్నాల్లో టీమ్ ఉంది.
చిన్న చిత్రాల్లో మరో సెన్సేషన్ అవుతుందనే రేంజ్ లో పబ్లిసిటీ ప్లాన్ చేసుకున్న ‘తెల్ల కాగితం’ ఇటీవలే ఈ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. యూత్ కి సంబంధించిన ఒక సెన్సిటివ్ ఇష్యూని ఇందులో టచ్ చేశారట. ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో రూపొందిన చైల్డ్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్’ సైతం అదే తేదీకి రావొచ్చని వినికిడి. ఇవి కాకుండా డబ్బింగ్ బాపతు ‘డిమాంటీ కాలనీ 3’ రేసులో ఉంది. బాలీవుడ్ ‘దృశ్యం 3 ది కంక్లూజన్’ పట్ల మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.
ఇంత రష్ ఎందుకంటే దసరాకు భారీ ప్యాన్ ఇండియా సినిమాలు క్లాష్ కాబోతున్నాయి కాబట్టి. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ తొమ్మిదికి వస్తుంది. అక్టోబర్ పదిహేను రజనీకాంత్ ‘జైలర్ 2’ ఎప్పుడో అనౌన్స్ చేశారు. రోజు గడవడం ఆలస్యం విజయ్ దేవరకొండ ‘రణబాలి’ వచ్చేస్తుంది. పోటీలో ధనుష్ ‘ఓమ్’ కూడా ఉంది. సో వీటి మధ్య నలిగిపోకుండా ఉండేందుకే మీడియం బడ్జెట్ మూవీస్ గాంధీ జయంతిని టార్గెట్ చేసుకోవడం బాగానే ఉంది కానీ ‘ఆదర్శ కుటుంబం’ని ఫేస్ చేయడం అంత సులభంగా ఉండదేమో.
This post was last modified on September 11, 2026 3:27 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…