Political News

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది నాయకులు ప‌క్క‌కు వెళ్లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఉత్తరాంధ్ర రాజ‌కీయాల్లో వైసీపీ చాలా చాలా వెనుక‌బ‌డిపోయింది. అధికార కూట‌మి ప‌క్షాలు.. ఉత్త‌రాంధ్ర పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాయి. గిరిజ‌న ప్రాంతాల్లో జ‌న‌సేన‌, మైదాన ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీంతో వైసీపీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.

విశాఖ‌లో బీజేపీ-టీడీపీలు దూకుడుగా ఉన్నాయి. అభివృద్ధి పెట్టుబ‌డుల మంత్రాన్ని ప‌ఠిస్తున్నాయి. గూగుల్ డేటా కేంద్రం స‌హా.. ఐటీ రంగానికి సంబంధించిన పెట్టుబ‌డులు ఆక‌ర్షించారు. ఇక‌, స్థానికంగా ఉపాధి ఉద్యోగాలు మెరుగ‌వుతున్నాయి. ఈ ప‌రిణామాలు.. రాజ‌కీయంగా టీడీపీని, కొన్ని ప్రాంతాల్లో బీజేపీని కూడా బ‌లోపేతం చేస్తున్నాయి. ఇక‌, విజ‌య‌న‌గ‌రంలో భోగాపురం విమానాశ్ర‌యం రాక‌తో పూర్తిగా ప‌రిస్థితి మారిపోయింది. అలాగే.. శ్రీకాకుళంలో ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ ప‌రిశోధ‌న కేంద్రం ఏర్పాటు రోగుల‌కు స‌ర్కారు ఆస‌రా వంటివి రాజ‌కీయ ముఖ చిత్రాన్నిమారుస్తున్నాయి.

మ‌రోవైపు.. వైసీపీలో  ఉత్త‌రాంధ్ర నాయ‌కుల మ‌ధ్య విభేదాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. సొంత సోద‌రులే అయినా.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టుగా ఉన్నారు. విజ‌య న‌గ‌రంలో బొత్స సత్య‌నారాయ‌ణ ఆధిప‌త్యాన్ని అంగీక‌రించేది లేద‌ని ప‌రోక్షంగా చెబుతూ.. చిన్న శ్రీను పార్టీ మారిపోయారు. ఇక‌, పాత నాయ‌కులు కూడా దారులు వెతుక్కుంటున్నారు. విశాఖ‌లో అస‌లు వైసీపీ ఉందా.. లేదా.. అనే డౌట్ కొన‌సాగుతోంది.

ఎమ్మెల్సీగా ఉన్న వ‌రుదు క‌ల్యాణి ఏకప‌క్ష రాజ‌కీయాల‌ను కొంద‌రు నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ సొంత రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న టాక్ ఉంది. ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీని వాస్ కూడా.. పార్టీ మార్పు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఆయ‌న గ‌త కొంత కాలం గా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇలా.. మొత్తంగా ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ప‌రిస్థితి దిన‌దిన గండంగా ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా వ్య‌వ‌హారాల‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చూస్తున్నారు. విశాఖ‌, శ్రీకాకుళం వ్య‌వ‌హారాల‌ను మాజీ మంత్రికుర‌సాల క‌న్న‌బాబు చూస్తున్నారు.కానీ, వారికి ప‌ట్టు చిక్క‌డం లేద‌న్న‌ది స్థానికంగా వినిపిస్తున్న‌టాక్‌.

This post was last modified on September 10, 2026 10:10 pm

Share

Recent Posts

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

25 minutes ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

32 minutes ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

3 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 hours ago