Movie News

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్ బాబు యుద్ధాన్ని రుద్ర, రాముడి గెటప్స్ లో చూపిస్తాడు. ఇంకొకరేమో అదుర్స్ లో చారిని, మనీలో ఖాన్ దాదాని కలిపి బ్రహ్మానందం లవ్ స్టోరీ సృష్టిస్తాడు. మరొకరు 1980స్ లో మన టాలీవుడ్ హీరోలు కాలేజీకి వెళ్లి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఒక అందమైన వీడియో తయారు చేస్తారు. యెషనాగుల కట్టకు బాలయ్య, రవితేజ డాన్స్ మిక్స్ చేసిన మహానుభావులున్నారు.

ఇదంతా ప్రాథమిక దశలో సరదాగానే అనిపించవచ్చు. కానీ ఒక భవిష్యత్తు హెచ్చరికగా చూడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ప్రాధమిక పరిజ్ఞానంతోనే నెటిజెన్లు ఇంత క్రియేటివిటీ చూపిస్తే వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్న నిర్మాతలు తెరమీద ఇంకెంత క్వాలిటీ చూపించాలి. ఈ మధ్య పరిస్థితి ఎలా అయిపోయిందంటే టీజర్లతోనే జనాలు నిర్మొహమాట తీర్పులు ఇచ్చేసి మేకర్స్ ని భయపెడుతున్నారు. చిరంజీవి విశ్వంభర కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు.

ఏఐ పుణ్యమాని విఎఫ్ఎక్స్ మెల్లగా అరచేతుల్లోకి వస్తోంది. ఇదంతా ముందుగానే ఊహించి చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు తమ ఫోటోలు, వీడియోల మీద కోర్టు నుంచి రక్షణ కల్పించుకున్నారు. అయినా సరే అన్నింటిని కంట్రోల్ చేయడం అసాధ్యం. అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోవడం జరగని పని. చట్టాలు ఇంకా కఠినం కావాలి. దానికి మరింత సమయం పడుతుంది. ఈలోగా జరిగే డ్యామేజ్ ఎంత ఉంటుందనేది మాటలకు అందడం లేదు.

ఇప్పటికేదో ఈ వ్యవహారమంతా నవ్వులాటగా కనిపించవచ్చు. కానీ ఫ్యూచర్ ఇలా ఉండదు. సపోజ్ ఏదైనా సినిమాలో ఫలానా ఎపిసోడ్ బాగా రాలేదనుకుందాం. అప్పుడో ఏఐ యుజర్ ఎలా ఉండాలో చూపించేందుకు దాని కన్నా మెరుగ్గా ఏదైనా వీడియో చేసి, అది వైరలయ్యి మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది అనుకుందాం. అప్పుడు ఒరిజినల్ దర్శకుడు పడే నరకయాతన అంతా ఇంతా కాదు. వాళ్ళను ఎలా ఆపాలి అనేదాని కన్నా ఎవరు అందుకోలేనంత గొప్ప క్వాలిటీని మనం ఎలా ఇవ్వాలనే దాని మీద దృష్టి పెట్టడం ఒకటే దీనికి పరిష్కారం. 

This post was last modified on September 10, 2026 9:59 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago