ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర సరిహద్దు ప్రాంతంగా చూపించడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది.
ప్రపంచ దేశాలకు సంబందించిన సరిహద్దు ప్రాంతాలను ఖచ్చితంగా, సమానంగా చూపించాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ కరెక్ట్ ది మ్యాప్ పేరుతో ఒక తీర్మానం చేసింది. దీనికి ఆఫ్రికన్ యూనియన్ తో పాటుగా మన భారతదేశం కూడా మద్దతు ఇచ్చింది. జులై 1 వ తేదీన తెరపైకి వచ్చిన కొత్త మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులను ఇష్టారాజ్యంగా మార్చివేయడం ప్రపంచం గమనించింది. దీంతోపాటుగా అక్సాయ్ చిన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ నియంత్రణ రేఖల విషయంలో కూడా వివాదస్పదంగా వ్యవహరించడంతో మన దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.
అరుణాచల్ ప్రదేశ్ కు నాగాల్యాండ్ తో వున్న సరిహద్దులను చెరిపివేయడమే కాకుండా దాన్ని చైనా, అస్సాం సరిహద్దులతో ముడిపడి వున్న స్వతంత్ర ప్రాంతంగా చూపించారు. అలాగే అక్సాయ్ చిన్ ను కూడా భారత్, చైనా సరిహద్దులు కలిగిన స్వతంత్ర ప్రాంతంగా ప్రతిపాదించారు. జమ్మూ కశ్మీర్ ను భారత్, పాకిస్తాన్ మధ్య వున్న నియంత్రణ రేఖను కొత్త మ్యాప్ లో చుక్కల గీతలతో చూపించడం వివాదంగా మారింది. దీన్ని భారత్, పాకిస్తాన్ లు అంగీకరించిన తాత్కాలిక రేఖగా పేర్కొన్నారు.
భారతదేశం సార్వభౌమాధికారానికి భంగం కలిగించే ఎలాంటి మ్యాప్ ను అంగీకరించేది లేదని మన విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కరెక్ట్ ది మ్యాప్ కు మద్దతు ఇచ్చినప్పటికి సరిహద్దుల మార్పులు చేర్పులను గుడ్డిగా ఆమోదిస్థామనుకోవడం పొరపాటని చెప్పేసింది. కొత్త మ్యాప్ లో ఇష్టమొచ్చినట్లు మార్పులు చేయడానికి కారణాలను ఐక్య రాజ్య సమితి వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates