డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పటిదాకా బాలయ్య సెట్స్ లో అడుగు పెట్టలేదు. ఎప్పటి నుంచి షూటింగ్ లో పాల్గొనవచ్చో డాక్టర్ల బృందం నిర్ధారించాక అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ ఎలాగూ అయిపోయింది కాబట్టి దసరా నుంచి రీ స్టార్ట్ అవ్వొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతకన్నా లేట్ అయితే ఇబ్బందే.
ఒకవేళ మనసు మార్చుకుంటే మటుకు దాదాకు సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఆల్రెడీ పోటీ తీవ్రంగా ఉంది. వెంకటేష్ కళ్యాణ్ రామ్ ‘జనవరి 12 విడుదల’కు ఆల్రెడీ థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. చిరంజీవి ‘కాకా’ వెనక్కు తగ్గే ఉద్దేశం లేదని, విశ్వంభర కోసం త్యాగం చేసే ఆలోచనలో లేమని కేవీఎన్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ నిర్మాతగా రూపొందుతున్న ‘మహాకాళి’ అందరికంటే ముందు రావడానికి ఉరకలు వేస్తోంది.
ఇంకోవైపు మేనమామ పోటీ ఉన్నా సరే సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ని పండక్కు విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. ఇక్కడితో అయిపోలేదు. శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ తేదీ వేసుకుని మరీ పరుగులు పెడుతోంది. శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ మైత్రి నిర్మాణం కావడంతో ఆటంకాలు లేకుండా షూట్ చేసుకుంటోంది. ఇవి చాలవు అన్నట్టు రజనీకాంత్ ‘ధర్మన్’ కూడా పొంగల్ కే వస్తుందని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు ముందస్తు సంకేతాలిస్తున్నారు. తెలుగులో కూడా రిలీజ్ ఉంటుంది.
ఇవన్నీ చూసుకుని మరీ దాదా వస్తే మటుకు బాక్సాఫీస్ వద్ద థియేటర్ల కోసం పెద్ద యుద్ధాలే చేయాల్సి ఉంటుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రెస్ట్ కారణంగా కొంత ఒళ్ళు చేసిన బాలయ్య ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నారని వినికిడి. మరి మాటకు కట్టుబడి క్రిస్మస్ వస్తారో లేక తప్పించి సంక్రాంతి అంటారో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates