Political News

కొండా సురేఖకు బీఆర్ఎస్ లో నో ఎంట్రీ

మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ కార్యచరణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సురేఖ బీజేపీలో చేరతారని పుకార్లు వస్తున్నాయి. అయితే, అనూహ్యంగా గులాబీ గూటికి చేరేందుకు సురేఖ మొగ్గు చూపుతున్నట్లు ఆమె వ్యాఖ్యలు ఉంటున్నాయి. కేసీఆర్ చాలా మంచోడంటూ సురేఖ కితాబిచ్చిన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నారని స్పష్టమైంది.

ఈ క్రమంలోనే కొండా సురేఖ ఆశలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నీళ్లు చల్లారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి రానివ్వబోమని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు తాకనివ్వబోమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో సురేఖకు బీఆర్ఎస్ తలుపులు మూసుకుపోయాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరినీ తీసుకోబోమని కరాఖండిగా జగదీష్ రెడ్డి చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకునే ప్రసక్తే లేదని, ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్‌లోకి వస్తామంటే తీసుకోలేదని ఆయన బాంబు పేల్చారు. ఇక, ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎష్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అంతకుముందు, బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవహారశైలి బాగుండేదని, ఆయన చాలా మంచి వ్యక్తి అని సురేఖ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమను ఎంతో గౌరవంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని ఆమె కొనియాడారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టం చేశారు. అడిగిన వెంటనే తమ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కొండా దంపతులకు ఉన్న ఏకైక ఆప్షన్ బీజేపీనే.

This post was last modified on September 4, 2026 10:28 pm

Share

Recent Posts

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

1 hour ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

3 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

3 hours ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

4 hours ago

సోషల్ మీడియాలో చెప్పి మరీ సినిమాకు వెళ్తున్న కేటీఆర్

రాజకీయ నాయకుల్లో చాలా మందికి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్లకు కూడా సినిమాలు…

5 hours ago