అగ్రరాజ్యం అమెరికాలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. మన దేశంలో మాదిరిగా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు అక్కడ జరగవు. నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు వస్తాయి. అందులోనూ రెండేళ్లు గడిచిన తర్వాత.. అధ్యక్ష ఎన్నికలకు బీజం పడుతుంది. ప్రజల అభిప్రాయాలను అనుసరించి మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. దీనిలో వచ్చే అనుకూలతల ఆధారంగా నాలుగేళ్ల తర్వాత.. ఆయా పార్టీలు అధ్యక్ష అభ్యర్థులను ఖరారు చేస్తాయి.
ఈ మధ్యంతర ఎన్నికలు కూడా.. అచ్చంగా అధ్యక్ష ఎన్నికల తరహాలోనే ప్రచార ఆర్భాటాలతో.. విమర్శలు, ప్రతివిమర్శలతో ముందుకు సాగుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్లకు మధ్య ఈ మధ్యంతర ఎన్నికల ప్రచారం దుమ్మురేపుతోంది. అయితే.. సహజంగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పోటీకి నిలిచే అవకాశం లేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి గరిష్ఠంగా రెండుసార్లకు మించి అధ్యక్షుడు కారాదు.
దీంతో ఇప్పుడు రిపబ్లికన్ తరఫున ట్రంప్ సూచించిన అభ్యర్థి ప్రచారంలో ఉన్నారు. ఇదిలావుంటే.. ట్రంప్ శిష్యుడిగా భావిస్తున్న సదరు నేత.. ఆయన భావాలను పుణికి పుచ్చుకున్నట్టుగా ఉన్నారు. దీంతో ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. `టీ-లో` అనే పాలిటిక్స్‌కు తెరదీశారు. దీనర్థం.. పురుషాంగం పనిచేయదని!. నిజమే.. దీనిని అలానే పిలుస్తారు. టెస్టోస్టిరాన్(పురుషాంగం స్తంభించేందుకు కీలకమైన హార్మోన్) తక్కువగా ఉన్నవారికి ఈ సమస్య ఉంటుంది.
ఈ విషయాన్ని ఎవరూ బహిరంగంగా చెప్పుకోరు. ముఖ్యంగా అశ్లీలతగా కూడా భావిస్తారు. కానీ, ఇప్పుడు ఈ విషయమే అమెరికాలో ఎన్నికల ప్రచారంగా మారింది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో పోటీ పడుతున్న నాయకులను ఉద్దేశించి ట్రంప్ శిష్యుడు టీలో నాయకులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో కూడా ఆగకుండా.. వారి భార్యలు ఆలస్యంగా ఇంటికి వస్తారంటూ.. ద్వంద్వార్థ పదాలను బహిరంగ వేదికలపై వినియోగించారు. ఇలాంటి వారు.. ప్రజాసేవకు పనికిరారని అంటున్నారు.
ఇక, ఈ వ్యాఖ్యలకు డెమొక్రాట్లు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా ఈ ప్రచారం వినలేక మహిళలు.. లబోదిబోమంటున్నారు. ఇక, ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తెచ్చిన ఈ ఒరవడి కొత్తకాదు.. ఫస్ట్ టైమ్ ఆయన అధ్యక్ష బరిలో నిలిచినప్పుడు హిల్లరీ క్లింటన్.. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో స్వయంగా ట్రంప్.. ఆమెను ఉద్దేశించి.. అత్యంత కృతక పదాలు వినియోగించారు. “మొగుడినే సుఖ పెట్టడం తెలియదు.. అమెరికాను ఏం సుఖ పెడుతుంది“ అని వ్యాఖ్యానించారు. సో.. మొత్తంగా అగ్రరాజ్యం రాజకీయాలు.. అథమ స్థాయిలో కొనసాగుతున్నాయని ప్రపంచం నివ్వెర పోతోంది.
This post was last modified on September 3, 2026 8:01 pm
ఒక్క చిన్న క్లాజ్... ఒక మహిళకు ఉపశమనం కలిగించగా.. మరో అధికారికి 2 లక్షల రూపాయల పెనాల్టీ విధించేలా చేసింది.…
ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్లుగా చలామణి అవుతున్న చాలామంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డవాళ్లే. ఇంటర్వ్యూల్లో వారిని కదిపితే.. ఒకప్పటి…
నటుడు శివాజీ డిమాండ్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ నుంచి మొన్న లెనిన్ దాకా…
నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను…
రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన యాభై సినిమాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ షూటింగ్…