Political News

వెలిగొండ పై రాజకీయం మొదలు పెట్టిన హరీష్ రావు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో సోమ‌వారం సీఎం చంద్ర‌బాబు.. నాలుగు జిల్లాల్లోని 30 మండ‌లాల‌కు మేలు చేసే `పూల సుబ్బయ్య వెలిగొండ` ప్రాజెక్టును ప్రారంభించారు. త‌ద్వారా 4 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, 23 ల‌క్ష‌ల కుటుంబాల‌కు తాగు నీరు, మ‌రో 2 ల‌క్ష‌ల ఇళ్ల‌కు ఇంటింటి కుళాయి ద్వారా నీరు స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. అయితే.. అక్క‌డ నీరు పారితే.. తెలంగాణ‌లో ఇదే వెలిగొండ ప్రాజెక్టు రాజ‌కీయ విమ‌ర్శ‌లు పెల్లుబికేలా చేసింది. బీఆర్ఎస్ నాయ‌కుడు, జ‌ల‌వ‌న‌రుల శాఖ మాజీ మంత్రి హ‌రీష్ రావు.. సీఎంరేవంత్ రెడ్డిని ఉద్దేశించి స‌వాళ్లు రువ్వారు. విమ‌ర్శ‌లు గుప్పించారు.

దోచిపెడుతున్నారు!

కృష్ణా జ‌లాల‌ను ఏపీకి దోచిపెడుతున్నారంటూ.. హ‌రీష్‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు నానా తిప్పలు పడుతున్నార‌ని.. ఈ విష‌యంపై సీఎం రేవంత్ మౌనంగా ఉంటూ.. మ‌రోవైపు ఏపీకి నీటిని దోచిపెడుతున్నార‌ని అన్నారు. వెలిగొండ ఏపీకి వ‌ర‌మైతే.. తెలంగాణ‌కు గుదిబండ అని హ‌రీష్‌రావు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు ద్వారా.. తెలంగాణ వాటాకు సంబంధించిన కృష్ణా జ‌లాల‌ను కూడా ఏపీకి పారిస్తున్నార‌ని.. ఇంత జ‌రుగుతున్నా రేవంత్ మౌనంగా ఉన్నార‌ని, ఆయ‌న రైతుల పాలిట శాపంగా మారార‌ని వ్యాఖ్యానించారు. `వెలిగొండ.. మ‌న‌కు గుదిబండ` అని పేర్కొన్నారు.

రైతుల హ‌క్కులేమ‌య్యాయి?

రైతుల హ‌క్కులు కాపాడుతాన‌ని, తాను కూడా రైతు బిడ్డ‌నేన‌ని చెప్పుకొనే రేవంత్ రెడ్డి.. ఏపీ ప్ర‌భుత్వం హ‌ద్దులు మీరి వెలిగొండ ద్వారా నీటిని త‌ర‌లిస్తుంటే.. ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం తీవ్ర క‌రువుతో రైతులు అల్లాడుతున్నార‌ని.. మ‌రోవైపు బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగ‌ర్‌, క‌ల్వ‌కుర్తి వంటి కృష్ణా న‌ది నీటిపై ఆధార‌ప‌డిన ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోతున్నాయ‌ని వీటికి నీటిని విడుద‌ల చేయాల్సిన ప్ర‌భుత్వం.. ఈ విష‌యాన్ని విస్మ‌రించి. రైతుల‌కు క‌న్నీరు మిగిల్చుతోంద‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఏపీకి మాత్రం నీటిని త‌ర‌లించుకు పోయేలా దొడ్డిదారిలో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని నిప్పులు చెరిగారు.

గురువుకు ద‌క్షిణ‌గానా?

గురువుకు ద‌క్షిణ‌గా కృష్ణా నీటిని అప్ప‌గిస్తున్నారా? అని హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రాంత ఆయకట్టుకు నీరు ఇవ్వ‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో ఏపీ నీటిని త‌ర‌లించ‌డంతోపాటు.. అటు గోదావ‌రిపైనా.. ఇటు కృష్ణాపైనా ప్రాజ‌క్టులు క‌డుతుంటే..  ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. ఇదంతా గురు ద‌క్షిణ‌గా స‌మ‌ర్పిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని సవాల్ రువ్వారు. ఈ విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి జోక్యం చేసుకోవాల‌నికోరారు. 

This post was last modified on August 31, 2026 11:29 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

12 seconds ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

30 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago