Political News

జగన్ మన కులపొడే అని ఎగబడి ఓట్లు వేశాం

4 జిల్లాల‌కు సాగు నీరు, 4 ల‌క్ష‌ల మందికి తాగు నీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు తొలి ద‌శ పూర్తయిన సంగతి తెలిసిందే. మార్కాపురం జిల్లాలోని సుంకేసుల స‌హా క‌డ‌ప జిల్లా, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల వాసుల‌ దశాబ్దాల కల నెరవేరింది. అయితే, ఆ క్రెడిట్ అంతా నాదే అంటూ మాజీ సీఎం జగన్ పాత పాట పాడుతున్నారు. సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదంటూ మరో సారి క్రెడిట్ చోరీకి తెర తీశారు జగన్. ఈ క్రమంలోనే జగన్ పై మాజీ వైసీపీ నేత, టీడీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘గత ప్రభుత్వంలో మన కులపోడని అదే పనిగా ఎగబడి ఎగబడి జగన్ కు ఓట్లేశాం..’’ అంటూ మాగుంట చేసిన వ్యాఖ్యల షాకింగ్ గా మారాయి. అయితే, గెలిచిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పాడని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, 5 సంవత్సరాలు కాలం వెళ్లదీసి 2024 ఎన్నికలకు ముందు థూథూ మంత్రంగా పైలాన్ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన మూర్ఘుడు వాడు అంటూ జగన్ పై సంచలన విమర్శలు చేశారు.

కానీ, సీఎం చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, తానే శంకు స్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తానే పూర్తి చేసి ప్రారంభిస్తానని ఆయన మాటిచ్చారని, ఆ మాట ఈ రోజు నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. 2 నెలల కాలంలో 900 కోట్ల రూపాయల ఆర్ఆర్ ప్యాకేజీని చంద్రబాబు ఇచ్చారని, తనకు తెలిసి దేశంలో మరే సీఎం ఇలా చేయలేదని చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. అంతేకాదు, రెండేళ్ల కాలంలో 2 వేల కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుకు కేటాయించిన ఘనత కూడా చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఈ రోజు చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహించిందని, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని పొగడ్తలతో ముంచెత్తారు.

తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి ఆనందకరమైన రోజు మరొకటి లేదని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రాలేకపోతానేమో అని బాధపడ్డానని, కానీ, తాను తప్పకుండా రావాలని సీఎం చంద్రబాబు తనను కోరారని చెప్పారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూసి తన కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయని తెలిపారు. ఇటువంటి మహత్కార్యక్రమం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబుకు కితాబిచ్చారు.

This post was last modified on August 31, 2026 4:20 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

1 hour ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

3 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

4 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

4 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

5 hours ago