Political News

`జెన్‌జీకి` చేరువ‌గా జ‌న‌సేన‌… 2న `యువ‌ సేన`

ఏపీలో అధికారం పంచుకున్న కూట‌మి పార్టీ జ‌న‌సేన‌.. మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జెన్‌జీకి చేరువ అయ్యేలా.. `యూత్ @ జ‌న‌సేన‌` పేరుతో యువజ‌న విభాగాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న పార్టీ నుంచి తాజాగా వెలువ‌డింది. అనేక క‌స‌ర‌త్తులు.. యువ‌త నుంచి అభిప్రాయ సేక‌ర‌ణ చేసిన అనంత‌రం.. దీనికి శ్రీకారం చుట్టిన‌ట్టు పేర్కొంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌రు 2న అత్యంత అట్ట‌హాసంగా ఈ యువ‌జ‌న విభాగాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు జ‌న‌సేన కార్యాల‌యం వెల్ల‌డించింది. దీనిని ఆన్‌లైన్ వేదిక‌గా.. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రారంభించ‌నున్నారు. అది కూడా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోనే ఈ యువసేన‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. యువ‌సేన‌కు సంబంధించి ప్ర‌త్యేక గీతం, లోగో, దిశానిర్దేశం చేసే విధానాల‌ను కూడా అదే రోజు ఆవిష్క‌రించ‌నున్నారు.

ఈ క్ర‌మంలో పిఠాపురంలో  ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కులు, ఎంపీలు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అవుతున్న‌ట్టు పార్టీ తెలిపింది. అలానే.. పార్టీ కేడ‌ర్‌ను ప‌రిమితంగా రావాల‌ని సూచించారు. ఇక‌, ఈ యువ సేన ద్వారా.. పార్టీ మ‌రింత బ‌లం పుంజుకుంటుంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం యువ‌త‌కు ప్ర‌త్యేక విభాగం లేద‌ని.. వివిధ వ‌ర్గాల నుంచివ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ల మేర‌కు దీనిని ఏర్పాటు చేస్తున్నామ‌ని పార్టీ వివ‌రించింది.

గ‌తంలో యువ రాజ్యం..

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన స‌మ‌యంలో ఏడాది కాలంలోనే యువ‌రాజ్యం పేరుతో ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశారు. దీనికి అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వం వ‌హించారు. అయితే.. 2014లో జ‌న‌సేన ఏర్ప‌డినా.. ప్ర‌త్యేకంగా యువ‌త‌కు విభాగం లేదు. కేవ‌లం `వీర‌మ‌హిళ‌` పేరుతో  మ‌హిళా విభాగాన్ని మాత్ర‌మే ఏర్పాటు చేశారు. కాగా.. ఇటీవ‌ల యువ‌త ప్రాధాన్యాలు పెరుగుతుండ‌డం.. వారి ఆకాంక్ష‌లు.. వంటివాటిని దృష్టిలో పెట్టుకుని యువ‌త‌కు చేరువ అయ్యేందుకు.. యువ సేన‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు నాయ‌కులు తెలిపారు.

This post was last modified on August 31, 2026 3:24 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

33 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

1 hour ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago