Political News

కొడాలి నానిపై గుడివాడ‌లో గుస గుస

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు ద‌శాబ్దాలకుపైగా త‌న క‌నుస‌న్న‌లతో శాసించిన మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు.. ఉర‌ఫ్ నానీ.. గ‌త 2024 ఎన్నిక‌ల్లో తొలిసారి ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే.. రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఇటీవ‌ల కొంత మేర‌కు యాక్టివ్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే నాని ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నికలు అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న స‌త్తాకు స్థానిక ఎన్నిక‌లు స‌వాల్‌గా మార‌నున్నాయి.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గుడివాడ మునిసిపాలిటీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కొడాలి.. ఇప్పుడు త‌న హ‌వాను నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్క‌డ మొత్తం 31 వార్డులు ఉన్నాయి. గ‌త 2014, 2021లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. దీని వెనుక కొడాలి నాని బ‌లంగా చేసిన ప్ర‌య‌త్నాలు ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితులు స‌మూలంగా మారిపోయాయి. ఒక‌ప్పుడు కొడాలికి అండ‌గా ఉన్న య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావు.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు.

గ‌తంలో య‌ల‌వ‌ర్తికి.. ప‌నిగ‌ట్టుకుని కొడాలి మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చారు. అయితే.. ప్ర‌భుత్వం మార‌డంతో ఆయ‌న కూడా మార్పు దిశ‌గా అడుగులు వేశారు. ప్ర‌స్తుతం కొడాలికి ఈ వ్య‌వ‌హారం సెగ పెంచుతోంది. బ‌ల‌మైన స్థానిక నాయ‌కులు లేక‌పోవ‌డం.. టీడీపీ దూకుడుగా ఉండ‌డం వంటివి గుడివాడ‌లో కొడాలి వ్యూహాల‌కు చెక్ పెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌లలో త‌న‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైన నేప‌థ్యంలో దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ సారి గుడివాడ వైసీపీలో కాపులు కూడా త‌మ‌కు సీట్లు ఇవ్వాల‌ని డిమాండ్లు తెస్తున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గుడివాడ‌లో వైసీపీ స‌త్తాను నిరూపించ‌డం ద్వారా.. త‌న హ‌వా త‌గ్గ‌లేద‌ని చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్థానికంగా చేప‌ట్టిన అభివృద్ధిప‌నులు, ఎన్నారై నిధుల‌తో చేస్తున్న ప్రాజెక్టులు వంటివి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో పార్టీ ప‌రంగా కూడా బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. ఇక‌, వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన వారు కూడా ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో కొడాలిని సునాయాసంగా ఎదుర్కొన‌గ‌ల‌మ‌న్న ధీమా టీడీపీ నాయ‌కుల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on August 30, 2026 6:43 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago