Political News

యాదాద్రి బోర్డు మెంబర్ గా చిరంజీవి భార్య, తీసేయాలంటున్న కవిత

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలిలో సీనియర్‌ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడంపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆలయ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి ఎలా అవకాశం కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి సభ్యత్వం ఇవ్వడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు భాగస్వామ్యం ఉండే పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు. అయితే యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల నిధులతో అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. అలాంటి ఆలయ పాలకమండలిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఎలా సభ్యత్వం కల్పిస్తారని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడంపై అప్పట్లో రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను కవిత ప్రస్తావించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా ఎలా మారుస్తారని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సినీ నటుడి భార్యకు సభ్యత్వం ఎలా కల్పించారని ఆమె నిలదీశారు.

This post was last modified on August 27, 2026 4:05 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago