యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా నవ్వుతూ తమతో పనిచేసిన యువతి భోజనం పార్శిల్ తెచ్చుకునేందుకు వెళ్లి యాక్సిడెంట్ కు గురైందని లైఫ్ స్టైల్ లో పనిచేస్తున్న ఆమె సహోద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఆగస్టు 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఈ యాక్సిడెంట్ చేసింది జనసేన నేత, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ తనయుడు సంజూష్ అని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సంజూష్‌పై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. భారతి రోడ్డు దాటుతుండగా సంజూష్ నడుపుతున్న కారు ఆమెను ఢీకొట్టిందని తెలుస్తోంది. ఆ వెంటనే అదే కారులో భారతిని అపోలో ఆస్పత్రికి తరలించారని, తలకు బలమైన గాయం కావడంతో అప్పటికే భారతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలుస్తోంది. భారతి పనిచేస్తున్న లైప్ స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విని కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సంజూష్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.