Political News

కుటుంబానికో ఎకరా… సాధ్యమేనా కవిత గారూ?

2014 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఒకటి. అయితే, ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో, కాంగ్రెస్, బీజేపీలు ఆ విషయంపై కేసీఆర్ ను నిలదీశాయి. అయితే, తాము దళితులందరికీ 3 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పలేదని, స్థలం లభ్యతను బట్టి ఇస్తామని కేసీఆర్ మాట దాటేశారు. రాష్ట్రంలో స్థలాలు సరిపడినన్న లేవు కాబట్టి ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నది గులాబీ పార్టీ నేతల వాదన. కట్ చేస్తే…తాజాగా తన తండ్రి తరహాలోనే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి పథకం’ కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ప్రకటించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి భూమి అంటే వ్యాపార లావాదేవీలే అని, కానీ, పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచప్రాణాలని కవిత అన్నారు. పేదల అసైండ్ భూములనే ప్రభుత్వం లాక్కొని ప్రాజెక్టులకు ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ‘మేకవన్నె పులి’ అని, చెప్పేది సామాజిక న్యాయం అయితే, చేసేది ఆటవిక న్యాయమని విమర్శించారు. రేవంత్ రెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల దోపిడీ, రాక్షస పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆమె ఆరోపించారు.

సుమారు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుందని, సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం పేదల అసైన్డ్ భూములపై వారికే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, కవిత ఇచ్చిన హామీ ప్రాక్టికల్ గా అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూ పంపిణీ హామీ విషయంలో కేసీఆర్ చేసిన పొరపాటే కవిత చేస్తున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

This post was last modified on August 18, 2026 2:09 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago