Political News

అంబటి అంటే ఫైర్… ఫ్లవర్ కూడా!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో, దురుసు ప్రవర్తనతో అంబటి వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారితో అంబటి ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక, తనను అడ్డుకున్న పోలీసులకు అంబటి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సడెన్ గా పోలీసులపై అంబటి తీరు మారింది. గతంలో పోలీసులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన అంబటి…తాజాగా పువ్వులతో పోలీసులను కూల్ చేశారు.

అవును…విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అంబటి గులాబీ పూలిచ్చి గుడ్ బాయ్ అనిపించుకునే ప్రయత్నం చేశారు. గుంటూరులో డీఎస్సీ అభ్యర్థులు చేపట్టిన ర్యాలీకి సహకరించిన పోలీసులకు రోజ్ ఫ్లవర్ ఇచ్చారు ఫైర్ బ్రాండ్ అంబటి. ర్యాలీకి సహకరించి మండుటెండలో సైతం డ్యూటీ చేసిన పోలీసులను ఆయన అభినందించారు. 

దీంతో, అంబటిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంబటి అంటే ఫైర్ అనుకుంటివా…ఫ్లవర్ కూడా ఇస్తారు అంటూ మీమ్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా పోలీసులకు పువ్వులిచ్చి బ్యాడ్ బాయ్ నుంచి గుడ్ బాయ్ గా మారాలనుకున్న అంబటి ప్రయత్నం అభినందనీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on August 12, 2026 10:54 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

1 hour ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago