Movie News

బండ్ల గణేష్ కొడుకు ఇరగదీశాడుగా…

ఇండస్ట్రీలో ఏ విభాగంలో పని చేసిన వారైనా సరే, ఈ రంగంలో కొంత పేరు సంపాదించారంటే.. తమ పిల్లల్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటారు. ముఖ్యంగా కొడుకులను హీరోలను చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. హీరోలు, నిర్మాతలకైతే మరీ ఎక్కువ ఉంటుంది. బండ్ల గణేష్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మూడు దశాబ్దాలుగా నటనలో ఉన్న గణేష్.. తర్వాత నిర్మాతగా మారి భారీ చిత్రాలు తీసిన సంగతి తెలిసిందే. 

ఐతే ‘టెంపర్’ మూవీ తర్వాత పుష్కర కాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటూ, వ్యాపారాల మీదే దృష్టిపెట్టిన గణేష్.. ఇప్పుడు మళ్లీ ప్రొడ్యూసర్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఈసారి తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ పునరాగమనం చేయాలన్నది ఆయన కోరిక. బండ్లకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కాగా.. ముందుగా పెద్ద కొడుకు హితేష్‌ను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడు.

హితేష్ సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు తన టాలెంటును పరిచయం చేస్తూ టీజర్ వదిలేశాడు. కానీ అది సినిమా టీజర్ కాదు. తన సోదరి పెళ్లి వేడుకకు ముందు నిర్వహించిన సంగీత్ ఈవెంట్. ఇందులో బండ్ల నిర్మించిన ‘టెంపర్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌తో పాటు రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ నుంచి ఒక పాటకు అదిరిపోయే రీతిలో స్టెప్పులు వేశాడు హితేష్. మంచి ఈజ్‌, గ్రేస్‌తో హితేష్ వేసిన స్టెప్పులు, తన ఆహార్యం, హావభావాలు అన్నీ చూసి ఆ వేడుకకు హాజరైన వాళ్లు ఆశ్చర్యపోయారు. కుర్రాడిలో మంచి టాలెంట్ ఉందని ప్రశంసలు కురిపించారు. 

కొడుకు ప్రదర్శన చూసి బండ్ల గణేష్ పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. తన కొడుకును ఎంతో ఎత్తులో చూడాలని ఊహించుకున్నానని.. సంగీత్ వేడుకకు మూడు రోజుల ముందు డ్యాన్స్ చేయమని అని తాను అడిగానని.. అతను ఇంత బాగా చేశాడని చెప్పుకొచ్చాడు బండ్ల. కొడుకు డ్యాన్స్‌కు వచ్చిన స్పందన చూశాక బండ్ల తన అరంగేట్ర సినిమా కోసం సన్నాహాలను వేగవంతం చేస్తాడనడంలో సందేహం లేదు.

This post was last modified on August 10, 2026 8:17 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago