రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద బజ్ బాగానే ఉంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే ఎక్కువ నిర్మాణంలో ఉన్న సినిమాగా అభిమానులకు ప్రత్యేక అంచనాలున్నాయి. సాయి రాజేష్ రచన ప్లస్ నిర్మాణ భాగస్వామ్యం తీసుకోగా రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్, ధీరజ్ మొగిలినేని నిర్మాణ భాగస్వాములుగా ఉన్న ఈ ఎమోషనల్ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది మణిశర్మ సంగీతమని టీమ్ ముందు నుంచి చెబుతోంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత మెలోడీ బ్రహ్మ తన స్థాయి మేజిక్ మళ్లీయే రిపీట్ చేయలేదు. చాలా సినిమాలు వచ్చాయి కానీ వేటిలోనూ ఆయన ముద్ర కనిపించలేదు. అయితే సాయిరాజేష్ పట్టుబట్టి ఆయనతో కూచుని మరీ మంచి పాటలు చేయించుకున్నారని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వచ్చారు. దానికి తగ్గట్టే మొదటి పాట తొలిప్రేమ తోపు కాదే మంచి హిట్టయ్యింది. మిగిలినవి స్లోగా ఎక్కాయి. అయితే చార్ట్ బస్టర్ అనిపించుకునే స్థాయి లోనా అంటే పూర్తిగా ఎస్ అని చెప్పలేం.
కొన్ని పాటలు విజువల్ గా చూశాక కనెక్ట్ అవుతాయి. చెన్నై లవ్ స్టోరీ ఆ క్యాటగిరీలోకి వస్తుందేమో చూడాలి. మణిశర్మ ఇలాంటి లవ్ స్టోరీస్ కు సంగీతం ఇవ్వడం కొత్త కాదు. బడ్జెట్ తో సంబంధం లేకుండా ఒకప్పుడు మనసిచ్చి చూడు, చిరునవ్వుతో, రావోయి చందమామ లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఎన్నో ఇచ్చారు. చెన్నై లవ్ స్టోరీతో మరోసారి ఆ వింటేజ్ ఫీల్ ని తేవాలని సంగీత ప్రియులు కోరుకున్నారు. ఎల్లుండికి తీర్పు రానుంది.
ఒకవేళ చెన్నై లవ్ స్టోరీ కనక అంచనాలు అందుకోగలిగితే మణిశర్మకు మళ్ళీ ఆఫర్ల వర్షం కురవడం ఖాయం. తమిళంలో ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కీరవాణి లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు మూడు దశాబ్దాల తర్వాత కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మణిశర్మకు ఆ కెపాసిటీ ఉంది. దాన్ని బయట పెడితే ఎవరికైనా కాంపిటీషన్ ఇవ్వగలరు. నేను మీకు బాగా కావాల్సిన వాడిని తర్వాత కిరణ్ అబ్బవరంకు ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న రెండో మూవీ ఇది.
This post was last modified on July 22, 2026 7:51 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…