రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతంలో ప్లానింగ్ మొత్తం భూమా అఖిలప్రియ దంపతులు.. వారి అనుచరులే చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే పోలీసులు సైతం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ2 కాస్తా ఏ1గా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇక.. ఈ కిడ్నాప్ ఎపిసోడ్ కు స్ఫూర్తి.. ఆ మధ్య విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ గ్యాంగ్ సినిమాగా చెబుతున్నారు.
కిడ్నాపర్లు తన కిడ్నాప్ కార్యక్రమానికి ముందు గ్యాంగ్ సినిమాను నాలుగైదు సార్లు చూసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్ఫూర్తితోనే.. కిడ్నాప్ ప్లాన్ ను సిద్దం చేశారని చెబుతున్నారు. పదిసార్లు రెక్కి నిర్వహించిన వారు.. అనంతరం తాము అనుకున్నట్లే కిడ్నాప్ ఎపిసోడ్ ను విజయవంతంగా నడిపించారని చెబుతున్నారు. కాకుంటే.. కిడ్నాప్ జరిగిన కాసేపటికే విషయం పోలీసులకు వెళ్లటం.. వారు రంగంలోకి దిగటంతో ప్లాన్ బెడిసికొట్టినట్లుగా చెబుతున్నారు. కిడ్నాప్ చేసి.. కొన్ని కాగితాల మీద ప్రవీణ్ రావు అండ్ కో చేత సంతకాలు చేయించుకోవాలన్నదే వారి ఆలోచనగా చెబుతున్నారు.
కిడ్నాప్ కు ముందు భూమా బ్యాచ్ లోని వారికి ఈ సినిమాను చూపించారని చెబుతున్నారు. తొలుత వారు వేసుకున్న ప్లాన్ లో ఒక మహిళా అధికారి కూడా ఉండాలని భావించారని.. కానీ తర్వాత ప్లాన్ మార్చుకున్నారన్నారు. అంతేకాదు.. అందరూ ఒకేలాంటి డ్రెస్ లను నగర శివారులో కుట్టించారని చెబుతుంటే.. కాదు ఆళ్లగడ్డలోనే వాటిని సిద్ధం చేయించారన్న మాట వినిపిస్తోంది. తమ కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉన్న శ్రీనివాస్ చౌదరితో కిడ్నాప్ ప్లాన్ గురించి భూమా అఖిలప్రియ దంపతులు చర్చించినట్లుగా తెలుస్తోంది. సినిమాటిక్ కిడ్నాప్ ప్లాన్.. పోలీసుల ఎంట్రీ.. వేగంగా విచారణకు దిగటంతో.. ప్లాన్ కాస్తా బెడిసి కొట్టింది.
This post was last modified on January 8, 2021 10:14 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…