తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్ మాదిరిగానే ఉంటోంది. ఏ పార్టీలో ఉన్నా తనదైన మార్కు రాజకీయం, తనదైన మార్కు వ్యవహారంతో మల్లారెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న మల్లారెడ్డి… ఆ పార్టీని వీడతారంటూ చాన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వాదనలను కొట్టిపారేస్తున్న సీనియర్ నేత… మళ్లీ అవే వార్తలకు బలం చేకూర్చేలా వ్యవహారం నడుపుతూ నిజంగానే వార్తల్లో నేతగా నిలుస్తున్నారు. తాజాగా మల్లారెడ్డికి చెందిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తుంటే… ఇక మల్లారెడ్డి బీఆర్ఎస్ కు వీడ్కోలు పలికినట్టేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ వీడియోలో మల్లారెడ్డి అసలు నోరు మెదపనే లేదు. ఈ వీడియోలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగంలో ఆయన బీఆర్ఎస్ అదినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఓ రేంజిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పై ఆ రేంజిలో రేవంత్ విమర్శలు గుప్పిస్తూ ఉంటే…ఆయనకు వెనుక…ఆయనకు దాదాపుగా ఆనుకుని కూర్చుని ఉన్న మల్లారెడ్డి… తన ముఖంలో ఏ భావమూ కనిపించనీయకుండా అలా కూర్చుండి కనిపిస్తున్నారు..
కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతనే కదా. అంతేనా… టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి రాగానే ఎమ్మెల్యే టికెట్ తో పాటుగా ఏకంగా మంత్రి పదవి ఇచ్చి… మల్లారెడ్డికి రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం కల్పించిన నేతగా కేసీఆర్ ఉన్నారు. అలాంటి కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఓ రేంజి విమర్శలు సంధిస్తూ ఉంటే… మాట మాత్రంగా కూడా స్పందించని మల్లారెడ్డి…కనీసం అక్కడి నుంచి వెళ్లిపోవాలన్న సోయి కూడా లేకుండా కూర్చుని ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కేసీఆర్ ను ఆ రేంజిలో విమర్శలు గుప్పిస్తున్న వేదికపై అలా కూర్చుని ఉండిపోయిన మల్లారెడ్డి తీరు చూస్తుంటే… ఆయన గులాబీ పార్టీ నుంచి వేరు పడాలని దాదాపుగా నిర్ణయించుకున్నారన్న సరికొత్త విశ్లేషణలు రేకెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అదికారం కోల్పోయిన తర్వాత అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ లోకో, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోనో మల్లారెడ్డి చేరిపోయే దిశగా సాగుతున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా తనతో ఉప్పూనిప్పులా వ్యవహరించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో మల్లారెడ్డి అలా స్పందన లేకుండా కూర్చున్నారంటే.. ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోవాలని నిర్ణయించుకున్నట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 19, 2026 9:31 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…