Movie News

జన నాయకుడు బుకింగ్స్ ఏం చెబుతున్నాయి

ఇంకో నాలుగు రోజుల్లో జన నాయకుడు విడుదల కానుంది. తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మీద ఉన్నాయి. గంటకు పదమూడు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతూ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. తెల్లవారుఝాము షోలకు టికెట్ ముక్క దొరకనంతగా అభిమానులు బుక్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ షోలు క్రమంగా ఆరంజ్ రంగులోకి మారుతున్నాయి. తెలుగు వెర్షన్ కు మంచి థియేటర్లే దొరికాయి. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కావడంతో హైదరాబాద్ లో పెద్ద నెంబరే దక్కనుంది.

ఇదిలా ఉండగా భగవంత్ కేసరి రీమేకని తెలిసినా కూడా ఇంత రెస్పాన్స్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక్కడ కథేంటి, ఎలా ఉంటుందనే లెక్కలు ఫ్యాన్స్ వేసుకోవడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ కొత్త సినిమా రిలీజవుతుంది. దాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈసారి టీవీకే పార్టీ వర్గాలు తోడవ్వడంతో సెలబ్రేషన్స్ భారీ ఎత్తున ఉండబోతున్నాయి. సికంద్రాబాద్ సాయిరామ్ థియేటర్ లో ఫ్యాన్ షో ఏర్పాటు చేయడం చిన్న విషయం కాదు.

ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపై సినిమాలు చేయనని విజయ్ ఇచ్చిన స్టేట్ మెంట్ నిజమయ్యేలా ఉంది. మొదటి విడతలోనే సీఎం అయిపోవడంతో ఇకపై రాజకీయాలను తను చాలా సీరియస్ గా తీసుకోబోతున్నారు. ఒకవేళ ఐదేళ్ల పాలనతో ప్రజలను మెప్పించగలిగితే ఇంకో ఛాన్స్ దొరుకుతుంది. ఎలాగూ ప్రతిపక్ష పార్టీలు మెల్లగా చీలిక దిశగా వెళ్తున్నాయి. స్టాలిన్ లాంటి వాళ్ళను తక్కువంచనా వేయలేం కానీ విజయ్ అయితే బలంగా ఎదుగుతున్నాడు.

ఒక సినిమా తెలుగులో హిట్టయి తమిళంలో రీమేక్ అయ్యాక తిరిగి అదే తెలుగులో డబ్బింగ్ కావడం చాలా అరుదు. ఇంతకు ముందు రివర్స్ లో జరిగాయి. ఉదాహరణకు అన్నామలై కొండపల్లి రాజాగా వచ్చి తిరిగి బిర్లా రాముడుగా రిలీజయ్యింది. ఇదే తరహాలో చినరాస ఇక్కడ చిన్నరాజాగా అనువాదమయ్యాక అబ్బాయిగారుగా మళ్ళీ తీశారు. కానీ జన నాయకుడు విషయంలో జరిగింది వేరు. మరి అప్ గ్రేడ్ వెర్షన్ గా జన నాయకుడు తెలుగు జనాన్ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

This post was last modified on July 19, 2026 9:09 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago