మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కబోతున్న ఆర్సి 17 నవంబర్ నుంచి షూటింగ్ కు వెళ్ళడానికి దాదాపు రంగం సిద్ధమయ్యింది. దసరాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాజెక్టుని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారని తెలిసింది. ఇప్పటి దాకా దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ తెరవెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. తన శైలికి భిన్నంగా సుకుమార్ ఈసారి వేగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది.
ఇదంతా బాగానే ఉంది కానీ సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు పేర్లు బాగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో మొదటిది సాయి అభ్యంక్కర్. అల్లు అర్జున్ రాకాతో సహా చాలా క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్న ఈ యూత్ సెన్సేషన్ తో పని చేసేందుకు చరణ్, సుకుమార్ ఇద్దరూ ఆసక్తి చూపిస్తున్నారట. అయితే తన కమిట్ మెంట్స్ ఏ మేరకు తగినన్ని డేట్స్ దొరుకుతాయో చెప్పడం కష్టమని యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్.
రెండో పేరు శాశ్వత్ సచ్ దేవ్. దురంధర్ రూపంలో ప్రేక్షక లోకానికి సరికొత్త మ్యూజిక్ ని పరిచయం చేసిన ఈ యువకుడు కూడా సుకుమార్ పరిశీలనలో ఉన్నారట. అయితే సచ్ దేవ్ వర్కింగ్ స్టయిల్, కంపోజింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువ నార్త్ వాళ్లకు కనెక్ట్ అయ్యేలా అనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు చేయించుకోవడం పెద్ద టాస్క్. యాక్షన్ ఎంటర్ టైనర్ అంటున్నారు కాబట్టి కాంబో బాగుంటుంది. వినిపిస్తున్న లీకులు నిజమైతే ఇతనితో ఆల్రెడీ వర్క్ కూడా మొదలయిందని వినికిడి.
ఏ కోణంలో చూసినా ఈ సినిమా విడుదల 2028లోనే ఉంటుంది. ఒకవేళ సుకుమార్ కనక గట్టిగా టార్గెట్ పెట్టుకుంటే వచ్చే ఏడాది డిసెంబర్ లో చూడొచ్చు. లేదంటే అటుపై సంక్రాంతి లేదా వేసవి దాకా వేచి చూడాలి. హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా తేలలేదు. నయనతార ఒక ముఖ్యపాత్ర కోసం అడిగారనే టాక్ ఉంది కానీ అది ప్రస్తుతం పుకారే. క్యాస్టింగ్ కు సంబంధించిన చర్చలు బయటికి రాకుండా సుకుమార్ తీసుకుంటున్న జాగ్రత్తలు గట్టిగానే ఉన్నాయి.
This post was last modified on July 19, 2026 9:44 pm
జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…
ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…
చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…
జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…