సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు మార్లు చంద్రబాబు వ్యక్తిత్వ హననానికి జగన్ పాల్పడ్డ వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్ తీరు ఏ మాత్రం మారలేదు. చంద్రబాబు చర్మం మందం అంటూ జగన్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని దున్నపోతు తో పోల్చడం గమనార్హం.
చంద్రబాబు చర్మం కొంచెం మందం అని ప్రజలందరికీ తెలుసని, దున్నపోతు మీద వర్షం పడ్డా అది చలించదని, చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైందని జగన్ విమర్శించారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలన్నీ చంద్రబాబు సానుభూతిపరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని ఆరోపించారు. వారందరూ కలిసి సిండికేట్‌గా ఏర్పడి ధరలను నియంత్రిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.
ఆక్వా ధరలు పెరిగినా ప్రభుత్వం స్పందించలేదని, దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలించదో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంతేనని జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ హయాంలో ఆక్వారంగం అభివృద్ధిలో ఉందని, అప్పట్లో ఏపీకి ‘బెస్ట్ మెరైన్ స్టేట్’ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు.
ఆక్వా రైతుల సమస్యలపై అవసరమైతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మూడేళ్లలో మళ్లీ రైతు ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఆక్వా రంగానికి పూర్వవైభవం తెచ్చి సిండికేట్ వ్యవస్థను కూకటివేళ్లతో నరికేస్తామని ఆక్వా రైతులకు జగన్ హామీనిచ్చారు.
This post was last modified on July 15, 2026 3:03 pm
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…