Political News

ఎట్టకేలకు ఇంటికెళ్ళిన ప్రశ్న రావణ్

ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాదు, హిందూ మతాన్ని కించపరిచేలా రావణ్ పలు కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు రావణ్ అరెస్టును సమర్థిస్తున్నారు.

అయితే, రాజకీయ కక్షతోనే రావణ్ పై 30 కేసుల వరకు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో రావణ్ ను అరెస్ట్ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ వంటి వారు విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే రావణ్ కు నాలుగో కేసులోనూ బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత అతడిని పోలీసులు మరో కేసులో అరెస్టు చేయలేదు. దీంతో, రావణ్ తన లాయర్ జడ శ్రవణ్ కుమార్ తో మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన మీడియా ప్రతినిధులకు, జడ్జిలకు, లాయర్ జడ శ్రవణ్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఇంతకు మించి ఇప్పుడు తాను మాట్లాడలేనని, తర్వాత కూలంకషంగా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడతానని మీడియా ప్రతినిధులకు రావణ్ తెలిపారు.

వాస్తవానికి, మూడు కేసుల్లో రావణ్ కు బెయిల్ ఇచ్చినా నాలుగో కేసు పెట్టడంతో కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా, రావణ్ పై పోలీస్ స్టేషన్ ముందే జనసైనికులు దాడి చేసేందుకు ప్రయత్నించడం, పోలీసు వాహనాలపై కోడి గుడ్లు విసరడం, ఈ క్రమంలో పోలీసు అధికారులు కిందపడిపోవడం వంటి ఘటనలతో ప్రభుత్వంపై, హోం మినిస్టర్ అనితపై విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే రావణ్ ను మరో కేసులో అరెస్ట్ చేయలేదని టాక్. మరి, ఇకనైనా రావణ్ తన భాష మార్చుకొని విశ్లేషణాత్మక విమర్శలు చేస్తారా…లేక గతంలో మాదిరిగానే వివాదాస్పద వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

This post was last modified on July 4, 2026 8:20 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

50 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago