Political News

డ్యామేజ్ జరిగిందని రిపేర్లు చేశారు

మొన్న విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ ధర్మన్ ఫస్ట్ లుక్ మీద నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. ఏఐ వాడారని, ఏ మాత్రం సానుకూల అభిప్రాయం కలిగే అవకాశం లేకుండా నిర్లక్ష్యంగా పోస్టర్ డిజైన్ చేశారని అభిమానులు విరుచుకుపడ్డారు. విడుదల చేసే ముందు కనీసం ఒకసారి చెక్ చేసుకోలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. కమల్ హాసన్ నిర్మాతగా అశ్వత్ మరిముత్తు దర్శకుడిగా ఉన్న ఇలాంటి ప్రాజెక్టుకి ఈ స్పందన ఊహించనిది.

దెబ్బకు డ్యామేజ్ జరిగిందని గుర్తించిన నిర్మాణ సమస్త రాజ్ కమల్ ఇంటర్నేషనల్ వెంటనే దిద్దుబాటుకు పూనుకుంది. నిన్న చాలా బెటర్ గా అనిపించే కొత్త లుక్కు వదిలింది. అంతే కాదు మేకింగ్ అఫ్ ధర్మన్ అంటూ రజని మేకప్ వేసుకున్నట్టుగా ఉన్న విజువల్స్ పొందుపరిచి మమ అనిపించింది. నిజానికి అందులో మేకప్ కు సంబంధించి సరైన స్పష్టత లేదు. ధర్మన్ టైటిల్ మీద కూడా మిశ్రమ స్పందన ఉంది. పాత చింతకాయ పచ్చడి టైపులో పెట్టారనే కామెంట్స్ ఉన్నాయి.

రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ కన్నా ముందు వచ్చే మూవీ కావడంతో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కేవలం రెండు సినిమాల అనుభవమున్న అశ్వత్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే అనుమానం చెన్నై వర్గాల్లో లేకపోలేదు. డ్రాగన్ లాంటి న్యూ ఏజ్ స్టోరీతో మెప్పించడం వేరు,. రజని లాంటి మాస్ ఐకాన్ ని ప్రెజెంట్ చేయడం వేరు. కార్తీక్ సుబ్బరాజ్, శిరుతై శివ, పా రంజిత్ లాంటి వాళ్ళు ఈ పల్స్ ని పూర్తిగా పట్టుకోలేక బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేకపోయారు.

ధర్మన్ కన్నా ముందు విడుదల కావాల్సిన సినిమా జైలర్ 2. చాలా కాలంగా అప్డేట్స్ ఇవ్వడం మానేశారు. బాలయ్య, షారుఖ్ ఖాన్ ఇందులో క్యామియోకి నో చెప్పాక ఫైనల్ గా హృతిక్ రోషన్ రంగంలోకి దిగాడు. ఈ ఎపిసోడ్ షూట్ ఆల్రెడీ మొదలైపోయింది. అన్నట్టు ధర్మన్ కి తెలుగులో ఏ పేరు పెడతారనేది ఇంకా నిర్ణయించలేదట. తెలుగు వెర్షన్ హక్కులు కమల్ గత సినిమాలు పంపిణి చేసిన నితిన్ ఫ్యామిలీకే దక్కవచ్చని టాక్. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఫైనల్ కాకపోవచ్చు.

Kumar

Recent Posts

యాపిల్ ధరలు పెరిగాయండోయ్

కొత్తగా యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్ బుక్,…

39 minutes ago

ఫ్యామిలీ జానర్ వదలకండి ప్లీజ్

టాలీవుడ్ లో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, అయితే వరల్డ్ బిల్డింగ్ లేదా ప్యాన్ ఇండియా. వీటి పేరుతో ఎలివేషన్లు ఉన్న…

4 hours ago

బొత్స ఇలాకాలో మంత్రి పాగా… వైసీపీ ఖాళీ!

ఏపీలో చేరిక‌ల ప‌ర్వం ప్రారంభమైంది. ఎన్నిక‌ల‌కు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు ఆప‌రేష‌న్…

6 hours ago

మీరు భార‌తీయులేనా? స‌ర్‌కు చెప్పాలి!

మీరు భార‌తీయులేనా?- ఈ సందేహం ఎందుకు? అనే డౌటు రావొచ్చు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌(స‌ర్‌) ప్ర‌క్రియ‌లో ఇది…

8 hours ago

వేగంగా సినిమాలు చేయడం ఒక ఆర్టు

మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…

11 hours ago

నాగ వంశీపై రిలీజుల ఒత్తిడి ఎక్కువే

జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…

12 hours ago