జనవరిలో ‘అనగనగా ఒక రాజు’ విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని స్టేట్ మెంట్ ఇచ్చారు. దానికి తగ్గట్టే లైనప్ ఉంది కానీ షూటింగులు, ఇతరత్రా కార్యకమ్రాలు అనుకున్న రీతిలో సాగకపోవడం వల్ల వాయిదాల పర్వం కొనసాగింది. ముఖ్యంగా ఫిబ్రవరిలో ‘ఫంకీ’ దారుణంగా దెబ్బ కొట్టడం ఊహించని పరిణామం. ఇప్పుడు జూలైతో మొదలు మంత్లీ ప్యాకేజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.
వచ్చే నెల జూన్ 10 ‘లెనిన్’తో దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ ప్రేమకథకు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. కంటెంట్ మీద టీమ్ చాలా నమ్మకంగా ఉంది. ఆగస్ట్ 14 ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు బిజినెస్ ఎంక్వయిరీలు బాగున్నాయి. వీరభద్రుడు తర్వాతి సూర్య సినిమా కావడంతో బయ్యర్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు కన్నా తమిళంలో భారీ రేట్లు పలికేలా ఉంది.
సెప్టెంబర్ లో ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కార్తీ సర్దార్ 2, విజయ్ దేవరకొండ రణబాలి ఒక్క రోజు గ్యాప్ లో వస్తుండటంతో సేఫ్ డేట్ కోసం చూస్తున్నారు. ఒకవేళ సెప్టెంబర్ 25 నాని ప్యారడైజ్ కనక వచ్చే పనైతే మొత్తంగా ఆ నెల మీద ఆశలు వదిలేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎపిక్ ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. షూటింగ్ పూర్తయినప్పటికీ సరైన స్లాట్ కోసం ఎదురు చూడటం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతోంది.
ఇక అక్టోబర్ లో వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఉండనే ఉంది. గాంధీ జయంతికి థియేటర్లో ఉండాలని ఫిక్స్ అయ్యారు కానీ ఏ మేరకు సాధ్యమవుతుందో త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కాగా క్లారిటీ ఇచ్చాక అనౌన్స్ మెంట్ వస్తుంది. వాయిదా ప్రసక్తి ఉండకపోవచ్చని సమాచారం. ఇవి కాకుండా అశోక్ గల్లాతో తీసిన వీసా కూడా రిలీజ్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉంది. చూస్తుంటే నాగవంశీకి ఇవన్నీ బ్యాలన్స్ చేసుకోవడం పెద్ద ఒత్తిడి ఎదురయ్యేలా ఉంది. ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.
This post was last modified on June 25, 2026 10:27 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…