అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్ వీసా(ఎఫ్-1) కింద చదువు పూర్తయ్యే వరకు.. ఆ తర్వాత.. కూడా 60 రోజుల వరకు అక్కడే ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే… ఉదాహరణకు చదువు ఐదేళ్లు పట్టిందనుకుంటే.. వీసా అప్పటి వరకు అమల్లో ఉంటుంది. అదనంగా చదువు పూర్తయ్యాక.. మరో 60 రోజులు అమెరికాలోనే ఉండి.. ఉద్యోగ వేట ప్రారంభించవచ్చు. తద్వారా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతోంది.
కానీ.. ఇప్పుడు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యకు సంబంధించి మెజారిటీ విద్యార్థులు అభ్యసిస్తున్న డిగ్రీలపై అధ్యయనం చేసిన అగ్రరాజ్యం.. గరిష్ఠంగా.. ఈ ఎఫ్-1 వీసాలను 4 సంవత్సరాలకు పరిమితం చేయనుంది. అంటే.. ఐదు నుంచి ఏడేళ్లు పట్టే విద్యను ఎంచుకుంటే.. సదరు విద్యార్థులు నాలుగు సంవత్సరాలు ముగిసేలోగానే.. మళ్లీ వీసాలకు దరఖాస్తు సమర్పించాలి. అలానే.. చదువు పూర్తయ్యాక.. 60 రోజుల్లోగా ఉద్యోగం వెతుక్కునేందుకు ఉన్న అవకాశాన్ని కూడా అమెరికా ఇప్పుడు కుదించింది. దీనిని 30 రోజులకు పరిమితం చేసింది. తద్వారా.. ఇది మరింత భారం కానుంది.
ఎందుకు?
వీసా గడువు ముగిసిన తర్వాత.. దరఖాస్తు చేసుకుని ఉండేందుకు వీలున్నా.. చాలా మంది అభ్యర్థులు నిబంధనలకు భయపడి వీసాలకు అప్లయ్ చేయడం లేదు. పైగా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిని వెతికి పట్టుకునేందుకు హోం ల్యాండ్ అధికారులకు తలకుమించిన భారంగా మారుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వీసా గడువును గరిష్ఠంగా 4 సంవత్సరాలకు కుదించాలని అధికారులు చేసిన ప్రతిపాదనకు వైట్ హౌస్ దాదాపు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అలానే.. 60 రోజలు కూలింగ్ పిరియడ్(ఉద్యోగ వేట కోసం) కూడా 30 రోజులు చాలని అధికారులు ప్రతిపాదించారు.
భారత్‌పై ఎఫెక్టేనా?
అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంపై భారత్‌పై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ నుంచి ఏటా 50 వేలకు తక్కువ కాకుండా.. అమెరికాకు వెళ్తున్నారని.. వీరంతా ఏళ్ల తరబడి అక్కడే ఉండి.. ఉద్యోగాలు చూసుకుంటున్నారని.. కానీ, ఇప్పుడు వీసా నిబంధనలు మారడంతో నాలుగేళ్ల తర్వాత వీసాలు రెన్యువల్ కాకపోతే.. వారంతా తిరిగి దేశానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. తద్వారా దేశంలో మరింత నిరుద్యోగం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates