ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ కీలక అడుగు వేసింది. పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయం శుక్రవారం భాగ్య నగరి హైదరాబాద్ లో ప్రారంభమైంది. వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత నగరంలోని మణికొండలో జనసేన తెలంగాణ శాఖ కార్యాలయాన్ని పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు పార్టీ తెలిపింది.
జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలన్నీ పార్టీ తెలంగాణ శాఖ నేతల ఆధ్వర్యంలోనే జరగగా… ఆ తర్వాత పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు. కార్యాలయ భవనం మొత్తాన్ని పరిశీలించిన పవన్… పార్టీ అధ్యక్షుడి హోదాలో తనకు కేటాయించిన గదిలోకి అడుగుపెట్టిన పవన్… తన కుర్చీలో కూర్చున్నారు. హైదరాబాద్ లోని మణికొండలో నూతనంగా నిర్మించిన భవనంలో జనసేన కార్యాలయం కొలువుదీరింది.
జనసేన పార్టీ ఆవిర్భావం హైదరాబాద్ లోనే జరిగిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకే పరిమితం అయిన జనసేన తాజాగా తెలంగాణలోనూ యాక్టివ్ అయ్యింది. తెలంగాణ సమస్యలపైనా పోరాటం సాగిస్తామని స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం కూడా ఏర్పాటు కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఏపీలోనే యాక్టివ్ గా ఉన్న జనసేనకు తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళం, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ పార్టీ శాఖల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో కాకుండా పార్టీ రాష్ట్ర శాఖ తొలిసారిగా తెలంగాణలోనే ప్రారంభం కావడం గమనార్హం.
ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న దరిమిలా… హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ శాఖ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి జనసేన ఇక ఎంతమాత్రం ప్రాంతీయ పార్టీ కాదని, ఇకపై జనసేన ఓ జాతీయ పార్టీగానే పరిగణించాల్సిన అవసరం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా ఇప్పుడు పార్టీకి సంబంధించిన తెలంగాణ శాఖకు అధికారికంగా రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కావడం జన సైనికులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
This post was last modified on June 19, 2026 9:41 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…