ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి(బీహార్ కేడర్) సునీల్ నాయక్‌పై తీవ్రంగా మండిపడింది. సరెండర్ అవుతారా? లేక కేసులో వాదనలు కొనసాగిస్తారా? అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఈ కేసులో అన్నీ తెలుసునని వ్యాఖ్యానించింది.
తాజాగా సునీల్ నాయక్.. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఎంపీ(అప్పటి)ని నిర్బంధించి.. టార్చర్ చేయడం అంటే.. తీవ్ర విషయం. ఈ విషయం మీకు తెలుసు. రఘురామ అరెస్టు నుంచి ఆయనను స్టేషన్‌లో నిర్బంధించి టార్చర్ చేస్తున్నారని కూడా మీకు సమాచారం ఉంది. ఆ సమయంలో మీరు అక్కడే ఎందుకు ఉన్నారు? ఐపీఎస్ అధికారిగా రాజ్యాంగం గురించి తెలిసి కూడా.. మీరు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు అని ప్రశ్నించింది.
అంతేకాదు.. పార్లమెంటుపై దాడి చేసిన(ఉగ్రవాదులు) వారికి.. ఓ ప్రజాప్రతినిధిని (రఘురామను) టార్చర్ చేసిన వారికి పెద్దగా తేడా ఏమీ లేదు. మీరు కూడా ఆ పనిలో భాగస్వామ్యం అయ్యారు. తెలిసి కూడా ఆపలేకపోయారు. పైగా టార్చర్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్నారు. వినోదం చూశారా? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై వాదనలు వినిపిస్తారో.. లేక సరెండర్(పోలీసులకు లొంగిపోవడం) అవుతారో తేల్చుకోండి. అని వ్యాఖ్యానించింది. దీంతో సమయం కోరిన సునీల్ నాయక్ తరఫున న్యాయవాది.. కోర్టుకు విన్నవిస్తామన్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన రఘురామను ఆయన పుట్టిన రోజు నాడే హైదరాబాద్ నుంచి సీఐడీ అధికారులు బలవంతంగా తీసుకువచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరులోని సీఐడీ పోలీసు స్టేషన్‌లో ఆయనను నిర్బంధించి టార్చర్ చేశారని కేసు నమోదైంది. ఈ కేసు విచారణ ఇటీవల కూడా వచ్చింది. ఆ సమయంలోనూ హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. తాజాగా.. పార్లమెంటుపై దాడి చేసిన వారికి.. మీకు(ఐపీఎస్)కు తేడా లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on June 18, 2026 8:28 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…