2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది. తాము అధికారంలోకి వస్తే…ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను క్రమానుగతంగా భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ… అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో వైసీపీకి అధికారం దక్కగా… ఆ తర్వాత జాబ్ కేలండర్ అన్న మాట వైసీపీ నుంచి వినిపించ లేదు. నాడు విపక్షంగా ఉన్న టీడీపీ నుంచి జాబ్ కేలండర్ ఎక్కడ? అన్న ప్రశ్నలు వినిపించాయి.
ఇదంతా గతం అనుకుంటే… తమ పాలనలో ఓ కేలండర్ ను పక్కాగా అమలు చేశామని వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ నోట.. జాబ్ కేలండర్ కు బదులుగా సంక్షేమ కేలండర్ అన్న మాట వినిపించింది. సంక్షేమ కేలండర్ అన్న మాట నాడు వైసీపీ ఎన్నికల ప్రచారంలో వినిపించలేదు కదా అన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సంక్షేమ పథకాలకు నవ రత్నాలు అని పేరు పెట్టిన వైసీపీ… నిరుద్యోగులను ఆకర్షించే నిమిత్తం జాబ్ కేలండర్ ను పదే పదే పలికింది. అయితే జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్న మాటే వినిపించలేదు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు అందులో వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగాల భర్తీ తప్పించి మిగిలిన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ అన్నమాటే వినిపించలేదు. ఇదే విషయాన్ని టీడీపీ గట్టిగానే ప్రస్తావించింది. దానిపై వైసీపీ నుంచి పిన్ డ్రాప్ సైలెన్సే సమాధానం అయ్యింది.
మరి ఇప్పుడు కేలండర్ అన్న మాట జగన్ నోట వినిపించినంతనే అంతా ఆ దిశగా దృష్టి సారించారు. అయితే జగన్ నోట నుంచి వినిపించిన కేలండర్ జాబ్ లకు సంబంధించినది కాదని, ఆయన నోట వినిపించినది సంక్షేమ కేలండర్ అని తేలిపోయింది. సంక్షేమ కేలండర్ అన్న మాటే వైసీపీ పాలనలో వినిపించలేదు.
సంక్షేమ పథకాలను అయితే వైసీపీ అమలు చేసింది గానీ.. దానికి ఓ కేలండర్ అంటూ పేరేమీ పెట్టకుండానే అమలు చేసింది. అయితే దానిని ఇప్పుడు ప్రస్తావించిన జగన్… దానికి కొత్తగా సంక్షేమ కేలండర్ అని ఆయన పేరు పెట్టేశారు. దీనిపై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. జాబ్ కేలండర్ అని చెప్పిన జగన్.. దానిని అమలు చేయలేక ఇప్పుడు సంక్షేమ కేలండర్ అని చెబుతున్నారంటూ పలువుచు విశ్లేషిస్తున్నారు.
This post was last modified on June 18, 2026 5:12 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…