హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జనవరి 6వ తేదీన చెన్నైలో జరగబోతున్న డీఎంకే మహానాడులో పాల్గొనాల్సిందిగా ఏఐఎంఐఎంకు ఆహ్వానం అందింది. బీహార్లో మంచి ఫలితాలు సాధించిన మజ్లిస్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లో గెలిచింది.
ఇందులో భాగంగా రానున్న మే లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యుం (ఎంఎన్ఎం)పార్టీతో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈమధ్యనే సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. డెఫనెట్ గా రెండుపార్టీలు కలిసి పోటీ చేసే విషయంపైనే పొత్తు చర్చలు జరిగుంటాయని అందరు అంచనా వేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరి భేటి విషయాలు మాత్రం బయటకురాలేదు.
ఇంతలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ నుండి అధికారికంగా ఎంఐంఎ అధ్యక్షుడు అసదుద్దీన్ కు ఆహ్వానం అందటం ఆశ్చర్యంగా ఉంది. ఇటు కమలహాసన్ అటు స్టాలిన్ లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే సందిగ్దం వస్తే కచ్చితంగా డీఎంకేను అసద్ ఎంచుకుంటారని ప్రచారం మొదలైంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావటం గ్యారెంటీ అనే ప్రచారం ఊపందుకుంటోంది. కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవటానికే ఏపార్టీ అయినా సహజంగా మొగ్గు చూపుతుందనటంలో సందేహం లేదు.
కాబట్టి డీఎంకే నుండి వచ్చిన ఆహ్వానంతో అసద్ 6వ తేదీన చెన్నైకు చేరుకుంటారని సమాచారం. తర్వాత పొత్తులపై చర్చిస్తారట. కాకపోతే ఎన్నిసీట్లలో ఎంఐఎం పోటీ చేయటానికి స్టాలిన్ అంగీకరిస్తారనేదే ప్రధానం. ఎంఐఎం వర్గాల సమాచారం ప్రకారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అసద్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మరి ఎంఐఎం అనుకుంటున్నట్లు అన్ని నియోజకవర్గాలను డీఎంకే వదులుకుంటుందా ? ఎందుకంటే పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కు కూడా ఎన్నోకొన్ని సీట్లు వదులుకోవాల్సుంటుంది. కాంగ్రెస్ తో పొత్తును తెంచేసుకుని ఎంఐఎంతోనే పెట్టుకునేట్లయితే అప్పుడు 25 సీట్లు వదులుకునే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా తమిళనాడులో కూడా ఎంఐఎంకు డిమాండ్ పెరిగిపోతోందన్నది వాస్తవం. మరి బీహార్ ఎన్నికల్లో చూపిన ప్రభావాన్నే తమిళనాడులో కూడా ఎంఐఎం చూపగలుగుతుందా ?
This post was last modified on January 4, 2021 10:38 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…