ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీలతో్ కూడిన కూటమి నాటి అధికార పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో షాక్ తిన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కాలం పాటు బయటకే రాలేదు. ఏదో స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నాం అన్న రీతిలో సాగిన జగన్… ఇప్పుడిప్పుడే అధికార పక్షంపైకి ఎదురు దాడి మొదలుపెట్టినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై వరుసగా కార్యక్రమాలకు దిగుతున్న వైసీపీ తీరే ఇందుకు నిదర్శనంగా ఆ విశ్లేషణలు చెబుతున్నాయి.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మత్ప్యకారుల సమస్యలపై జగన్ ఓ కీలక సమీక్షను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో సమావేశం అయిన జగన్… వైసీపీ హయాంలో మత్స్యకారులకు ఏమేం చేశామన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా 2024 ఎన్నికల ముందు కూటమి పార్టీల నుంచి మత్స్యకారులకు మోసపూరిత హామీలు వచ్చాయని కూడా ఆయన ఆరోపించారు. ఆక్వా రంగానికి కూటమి సర్కారు చేస్తున్న అన్యాయంపై ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
జూలై 1న భీమవరంలో ఆక్వా రైతుల పక్షాన నిరసన చేపట్టనున్నామని, ఆ నిరసనలో తాను స్వయంగా పాలుపంచుకుంటానని జగన్ ప్రకటించారు. ఈ నిరసన ద్వారా ఏపీలోని ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశం చూసేలా చేస్తామన్నారు. ఈ నిరసనలో ఆక్వా రంగానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోవాలని, తమ సమస్యలపై కూటమి సర్కారును నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రకటన విన్నంతనే జగన్ ఇక అటాక్ మోడ్ లోకి వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఇటీవలే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ చేపట్టిన నిరసనలు ఓ మోస్తరుగా విజయవంతం అయ్యాయని, ఈ క్రమంలోనే ఈ సారి జగనే నేరుగా రంగంలోకి దిగుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు.
జగన్ నేరుగా రంగంలోకి దిగితే… వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే… మెగా డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ జగన్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నిరసనలు సక్సెస్ అయ్యాయని, ఈ ఫలితాలను చూశాకే ఇక రంగంలోకి ప్రత్యక్షంగా దిగాలని జగన్ నిర్ణయించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 16, 2026 6:09 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…