Political News

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ చివరి కోరిక మేరకు అతడిని పరామర్శించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. అభిమాన నాయకుడిని ఒక్కసారి కలవాలన్న చిన్నారి ఆకాంక్షను నెరవేర్చేందుకు పవన్ స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

చిన్నారిని పరామర్శించిన అనంతరం స్థానిక జనసేన నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది.

ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న ‘నవనిర్మాణ సభ’కు అనుమతి లభించకపోవడం, అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభకు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించడంతో పాటు తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించగా, బీజేపీ మాత్రం పవన్‌కు మద్దతు తెలిపింది.

ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ పవన్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పాటు తెలంగాణలో పర్యటించేందుకు తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఈ పరిణామాల మధ్య వరంగల్ పర్యటన ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అధికారికంగా చిన్నారి నిరంజన్‌ను పరామర్శించేందుకే ఈ పర్యటన అయినప్పటికీ, తెలంగాణ రాజకీయాలపై కూడా పవన్ స్పందించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణలో పార్టీ విస్తరణకు జనసేన వేగం పెంచినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర స్థాయి జాయినింగ్స్ కమిటీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వరంగల్ పర్యటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on June 16, 2026 2:23 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

59 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago