గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా.. దిగుమతులు కూడా తగ్గాయి. ఇక, గ్యాస్ కష్టాలు కూడా.. అనేక దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కష్టాలు మన దేశంలో కూడా కనిపించాయి. ఇప్పటికే చమురు ధరలను దేశవ్యాప్తంగా పెంచారు. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి.
దీనంతటికీ కారణం.. అమెరికా-ఇరాన్‌ల మధ్య జరిగిన యుద్ధం. అదేసమయంలో కీలకమైన గల్ఫ్‌లో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడం. ఫలితంగా పర్షియన్ గల్ఫ్ నుంచి రవాణా అయ్యే ఇంధనం, గ్యాస్ వంటివి ఒడిదుడుకులకు గురయ్యాయి.
కాగా.. అతి కష్టం మీద.. తాజాగా ఇరాన్-అమెరికాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. కీలకమైన అణు విషయంపై ఎటూ ముడి పడకపోయినా.. ఇతర అంశాలపై ఇరు దేశాలు.. అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా ఒప్పందం ఓకే అయింది. దీంతో హోర్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది.
ఇంకేముంది.. ఫలితంగా ఇంధన రవాణా మెరుగవుతుందని.. కావాల్సినంత ఇంధనం… లభిస్తుందని అందరూ అనుకున్నారు. నిజానికి ఇంధన సమస్యతో భారత దేశంలో డీజిల్, పెట్రోల్‌పై కోటా విధించారు. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.
తాజాగా ఒప్పందంతో హార్ముజ్‌ను తిరిగి తెరుస్తామని ఇరాన్ ప్రకటించడంతో ఈ కష్టాలు పోతాయని అందరూ భావిస్తున్నారు. కానీ, ఇక్కడే భారీ ట్విస్ట్ ఏర్పడింది. ఇప్పటికిప్పుడు.. హార్ముజ్ జలసంధిని తెరిచినా.. చమురు, గ్యాస్ కష్టాలు ఇప్పట్లో తొలిగిపోవని.. అమెరికాకు చెందిన ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక నౌకలు అసలు జలసంధిలోకే రాలేదని.. కొన్నింటికి బీమా సౌకర్యం కూడా రద్దయిందని చెబుతున్నారు. ఇప్పుడు వాటిని సరిచేసుకుని.. రవాణా ప్రారంభించేందుకు కనీసంలో కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు.
మరోవైపు.. దాడుల కారణంగా 120 మంది సిబ్బంది(వివిధ దేశాలకు చెందిన) మరణించారని.. వారి స్థానంలో వేరే వారిని పంపించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ అయ్యేందుకు మరో నాలుగు నుంచి 5 నెలలు పడతాయని అంటున్నారు. సో.. ఒప్పందం కుదిరినంత తేలికగా.. హోర్ముజ్ జలసంధిలో నౌకల రవాణా.. ఇంధన రవాణా వంటివి అంత తేలికగా కుదట పడవని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. ఒప్పందం కుదిరిన వెంటనే.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు బ్యారెల్‌కు 4 డాలర్లు తగ్గాయి. అయినా.. ఇది కూడా అమలు అయ్యేందుకు నెల రోజుల సమయం పడుతుందని అప్పటి వరకు వెయిట్ చేయకతప్పదని ప్రజలకు చెబుతున్నారు. ఇక, భారత్ విషయానికి వస్తే.. బ్యారెల్ చమురు ధరలు తగ్గినా.. దేశంలో తగ్గించే అవకాశం ఉండకపోవచ్చని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
This post was last modified on June 15, 2026 11:18 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…