Political News

షర్మిలకు సీటు ఇవ్వని కాంగ్రెస్

గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కలేదు. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో తనకు దక్కనున్న రాజ్యసభ సీట్లకు ఆయా అభ్యర్థులను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం రాత్రి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో షర్మిల పేరు కనిపించలేదు. వెరసి ఆమెకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటును ఇవ్వలేదని తేలిపోయింది.

తాను స్థాపించిన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల… అదే పార్టీలో చేరిపోయారు. పార్టీని విలీనం చేసినందుకు ఆమెను పార్టీ ఏపీ శాఖ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ… ఏదో ఒక రాష్ట్రం నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చింది.

తాజాగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో కర్ణాటక కోటా నుంచి షర్మిలకు ఓ సీటును కేటాయిస్తున్నట్లు ఇటీవలే ఖర్గే చెప్పినట్టు వార్త వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు అధిష్ఠానం పిలుపు మేరకు భర్తతో కలిసి షర్మిల ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్భంగా ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని ఆమె కలిశారు.

ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ కానున్న సీట్లలో మూడు సీట్లు కర్ణాటక కోటాలో ఉన్నాయి. ఆ మూడు సీట్లలో ఓ సీటును ఖర్గేకు కేటాయించిన అదిష్ఠానం.. ఇంకో రెండు సీట్లకు పార్టీ సీనియర్లు పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్ లను ఎంపిక చేసింది. ఇక తమిళనాడులో టీవీకే ఆఫర్ చేసిన సింగిల్ సీటును అందరూ ఊహించినట్లుగానే ప్రవీణ్ చక్రవర్తికి కేటాయించింది. మధ్యప్రదేశ్ కోటాలో అందిన సీటును టీపీసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు, రాజస్థాన్ సీటును నీరజ్ దంగికి, జార్ఖండ్ సీటును ప్రణవ్ ఝాకు కేటాయించింది.

మొత్తంగా ఈ దఫా కాంగ్రెస్ కు 7 రాజ్యసభ సీట్లు దక్కనుండగా… ఆ ఏడు సీట్లకు ఏడుగురు నేతలను అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఉన్న బలం మేరకు ఈ ఏడుగురు కూడా రాజ్యసభకు ఎన్నిక కావడం లాంఛనమేనని చెప్పాలి.

కర్ణాటక కోటాలో షర్మిలకు సీటు ఖాయమని, ఆ దిశగా వార్తలు వెలువడినా కూడా ఆ దిశగా జాబితాలో షర్మిల పేరు లేకపోవడం నిజంగానే షాకింగేనని చెప్పక తప్పదు. మాట ఇచ్చిన అధిష్ఠానం షర్మిలకు రిక్త హస్తమే అందించిన నేపథ్యంలో ఆమె ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on June 5, 2026 9:14 am

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

7 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

8 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

10 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

10 hours ago