‘‘నా పేరు ముఖేష్’.. ‘‘తన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చింది’’.. ‘‘కానీ ఎంత మూల్యానికి..’’.. ‘‘చక్కగా ఉండండి.. రనౌట్ కాకండి’’.. రెగ్యులర్‌గా సినిమాలు చూసే వాళ్లు ఈ డైలాగుల్ని అంత సులువుగా మరిచిపోలేరు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడినీ ముందు ‘ధూమపానం హానికరం’ అని హెచ్చరిస్తూ ఒక యాడ్ వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఒరవడి ఏడెనిమిదేళ్లుగా నడుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ప్రకటనల్ని రూపొందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రకటనలు మారుతూ ఉంటాయి. మళ్లీ థియేటర్లలో సినిమాల ప్రదర్శన మొదలయ్యే సమయానికి సిగరెట్ స్మోకింగ్ మీద కొత్తగా ఏ ప్రకటన వస్తుందో ఏమో కానీ.. దాంతో పాటుగా ఇప్పటిదాకా చూడని ఓ ప్రకటన దర్శనమిచ్చే అవకాశముంది. ఆ యాడ్ ‘కరోనా’ మీద రూపొందించింది అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ప్రస్తుతం దేశాన్ని కరోనా ఎలా కుదిపేస్తోందో తెలిసిందే. దీని ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. ఈ వైరస్ వ్యాప్తి ఎంతగా తగ్గుముఖం పట్టిన ఇంకో ఏడాది పాటు కచ్చితంగా దాని తాలూకు భయం కొనసాగవచ్చు. దీని గురించి మరిచిపోవడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఆందోళన తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వాలన్నీ కరోనా మీద అవగాహన కల్పించే, హెచ్చరించే పనిలోనే ఉన్నాయి. ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది. జనాలు మళ్లీ థియేటర్లకు రావడం మొదలయ్యాక సినిమాల మధ్యలో కచ్చితంగా కరోనా ప్రకటనలు వేయడం ఖాయం. అందులోనూ థియేటర్లలోనే కరోనా వ్యాప్తికి కాస్త ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి థియేటర్లలో ఎలా వ్యవహరించాలి.. ఇళ్లలో ఎలా ఉండాలి.. బహిరంగ ప్రదేశాల్లో ఎలా మసులుకోవాలనే విషయంలో జాగృతం చేస్తూ యాడ్స్ రావడం ఖాయం. కాబట్టి మళ్లీ సినిమాలకు వెళ్లే సమయానికి సిగరెట్ యాడ్స్‌తో పాటు కరోనా ప్రకటనలు కూడా చూడటానికి మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే.
This post was last modified on May 4, 2020 8:02 pm
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…