జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయా విషయాలపై తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ విషయంపై అయినా పవన్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కనిపించినా… ఆయా అంశాలపై ఆయన చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలేనని చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుపై పవన్ తీసుకున్న నిర్ణయమని చెప్పాలి. రాజకీయ విశ్లేషకుడిగా నాగేశ్వర్ ఏదో పొరపాటున అలా మాట్లాడి ఉంటారన్న పవన్… ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసులకు చెప్పినట్లుగా తెలిపారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు జనసేనతో పాటు బీజేపీని… పవన్, నాదెండ్ల మనోహర్, అమిత్ షాల పరువు తీసేవేనని చెప్పక తప్పదు. ఇదే రీతిన వ్యవహరించిన పవన్.. తొలుత నాగేశ్వర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయడంతో ఆ విషయాన్ని వదిలేయాలని పవనే స్వయంగా జన సైనికులకు తెలిపారు. నాగేశ్వర్ సారీతో అది ముగిసిన అధ్యాయమని కూడా పవన్ సోమవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మంగళవారం నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయం పవన్ వద్దకు రాగా… నాగేశ్వర్ ను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, ఆయనేదో పొరపాటున ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని పవన్ చెప్పారట. నాగేశ్వర్ ను అరెస్టు చేయవద్దని పవన్ నేరుగా పోలీసులకు చెప్పారట. ఈ విషయాన్ని పవనే స్వయంగా మంగళవారం నాటి పార్టీ శ్రేణుల సమావేశంలో వెల్లడించారు. నాగేశ్వర్ అరెస్టును వద్దని వారించి పవన్ తీసుకున్న నిర్ణయం భేషైనదన్నవాదన వినిపిస్తోంది.
వాస్తవానికి నాగేశ్వర్ అరెస్టు అయి ఉంటే… వైసీపీ దానిని తనకు అనుగుణంగా మలచుకునేది. నాగేశ్వర్ ను పవనే అరెస్టు చేయించారని ఆ పార్టీ ప్రచారం చేసేది. వెరసి నాగేశ్వర్ అరెస్టును వైసీపీ నేరుగా పవన్ మెడకే చుట్టేది. ఈ పరిణామాలను ముందుగానే గ్రహించిన పవన్… నాగేశ్వర్ అరెస్టును అడ్డుకుని ఓ పరిణతి కలిగిన నాయకుడిగా, విపక్షాలకు ఎక్కడికక్కడ కళ్లెం వేయగలిగిన చాతుర్యం తన వద్ద ఉందని నిరూపించుకున్నట్లైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
పనిలో పనిగా నాగేశ్వర్ ఇంట జరిగిన ఓ వివాహ వేడుకకు తాను హాజరైన విషయాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మిమ్మల్ని తిట్టే వ్యక్తి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పిలిస్తే వారి ఇంట జరిగే కార్యాలకు మీరు వెళతారా? అని ప్రశ్నించిన పవన్… నేను మాత్రం వెళతాను అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైసీపీకి చెందిన కీలక నేత అంబటి రాంబాబు కుమార్తె పెళ్లికి కూడా తాను వెళ్లానని చెప్పి ఈ సందర్భంగా పవన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
This post was last modified on May 26, 2026 11:44 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…