‘‘ఓన్లీ రజినీకాంత్ ఎగ్జిట్ పాలిటిక్స్ వితౌట్ ఎంటరింగ్ ఇట్’’.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న జోక్ ఇది. తాను రాజకీయాల్లోకి రావడం గురించి ఎప్పట్నుంచో ఊరిస్తున్న రజినీ.. ఇదిగో ఇదిగో అంటూనే చివరికి తన అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి రావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇందుకుగాను అభిమానులను క్షమాపణ కూడా కోరారు. కొంతమంది అభిమానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు కానీ.. రజినీ రాజకీయాల్లోకి వస్తాడన్న ఆశలతో ఇప్పటికే కొంత పని చేసి, భవిష్యత్ ప్రణాళికలతో ఉన్న అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది అభిమానులు రజినీ ఇంటిముందు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. తన ఆరోగ్యం గురించి పూర్తి స్పష్టతతో ఉన్న రజినీ.. కరోనా టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పెట్టే సాహసం చేయాలనుకోవట్లేదు.
ఐతే రజినీ రాజకీయారంగేట్రం కథ ముగిసిన కథ కాబట్టి.. ఇంతకీ వచ్చే ఏఢాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆయన ఎవరికైనా మద్దుతగా అయినా నిలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. తనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకున్న రజినీ.. ఆ అవకాశం లేనపుడు ఎవరో ఒకరికి మద్దతుగా నిలిచి వారి విజయానికి తోడ్పటానికి చూడొచ్చు. తనకున్న జనాదరణను ఆయనెందుకు వృథా చేసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ రజినీ రాజకీయాల్లోకి వస్తాడన్న అంచనాల తర్వాత ఆ వర్గమంతా ఏకతాటిపైకి వచ్చింది.
తనకు ఆప్త మిత్రుడైన కమల్‌కు ఆయన మద్దతుగా నిలిస్తే ఆయన మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంది. ఎలాగూ రజినీ పార్టీ పెట్టి ఉంటే.. కమల్‌తో కలిసేవారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తాను రాలేకపోతున్నాడు కాబట్టి.. తన మిత్రుడికి మద్దతు ప్రకటించి.. తన అభిమానులంతా కమల్ పార్టీకి మద్దతుగా నిలవాలని రజినీ కోరవచ్చు. కాకపోతే రజినీ ఎప్పుడూ హిందుత్వ భావజాలంతో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఆలోచనలు దానికి భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కమల్‌కు మద్దతుగా నిలుస్తాడా అన్న సందేహాలున్నాయి. మరి అన్నాడీఎంకే-బీజేపీ కూటమి లేదా.. డీఎంకేకు ఆయనేమైనా మద్దతిస్తారేమో చూడాలి.
This post was last modified on January 1, 2021 11:04 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…