జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…మరోమారు తమిళనాడు రాజకీయాలపైనా, సీఎంగా గెలిచిన స్టార్ హీరో దళపతి విజయ్ పైనా ఆసక్తికర కామెంట్లు చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పరిశీలన కోసం సోమవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన పవన్… ఆ తర్వాత సాయంత్రం నగరంలోనే పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు పాలిటిక్స్ ప్రస్తావన తీసుకుని వచ్చిన పవన్… కటౌట్ పెట్టేసిన విజయ్ నేరుగా సీఎం అయిపోయారని ఆసక్తికర కామెంట్ చేశారు.
తమిళనాడు రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్న పవన్… అక్కడి గెలుపు ఓటములతో ఇక్కడి ఫలితాలను ఎలా పోలుస్తారని ఇదివరకే ఓ దఫా పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజా వ్యాఖ్యల్లోనూ అదే తరహాలో స్పందించిన పవన్… తమిళనాడు ఎన్నికలు అత్యంత సాఫీగా సాగిపోయాయని అన్నారు.
కటౌట్ లు కట్టేసిన విజయ్ వాటితోనే ఏకంగా సీఎం అయిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితి అలా లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో డిప్యూటీ సీఎం కావడానికే తనకు ఏకంగా 12 ఏళ్ల సమయం పట్టిందని పవన్ అన్నారు.
తమిళనాడులో ఎన్నికలు అత్యంత సాఫీగా సాగిపోయాయన్న పవన్… వాటిని చూస్తే తనకే ఆశ్చర్యం వేసిందని.. నేను అసూయ పడ్డానని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఏమాత్రం కష్టపడకుండానే విజయ్ పార్టీ పెట్టడం, ఎన్నికల్లో నిలబడటం, ఏకంగా రెండు ప్రధాన పార్టీలను ఓడించి ఆయన సీఎం కుర్చీని అందుకోవడం చూస్తుంటే… నిజంగానే ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.
అదంతా చూస్తుంటే…నిజంగానే కటౌట్లతోనే విజయ్ సీఎం అయ్యారని చెప్పవచ్చన్నారు. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు తమిళనాడులోని పరిస్థితుల మాదిరిగా లేవని పవన్ అన్నారు. ఎక్కడి పరిస్థితులను బట్టి అక్కడి రాజకీయాలు సాగుతూ ఉంటాయని, అందుకే… ఒకదానితో మరో దానిని పోల్చడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on May 25, 2026 10:28 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…